టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతికి.. మూల స్తంభాలుగా దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల పేర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ ఇద్దరు గొప్ప నట్టులే. అప్పట్లోనే టాలీవుడ్ స్టార్ హీరోలుగా తమ నటనతో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వీరిద్దరూ.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కేవలం సహచర్లు మాత్రమే కాదు.. మంచి స్నేహితులు కూడా. అలా వీరిద్దరు కాంబోలో మాయాబజార్, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ఫణ ఇలా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోస్ అయినా ఇద్దరు కలిసి సినిమాలో నటించేటప్పుడు.. ఈగో కచ్చితంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల మధ్య రాజకీయాల వల్ల మనస్పర్ధలు తలెత్తయి. సినిమాలు పరంగా ఒకరినొకరు అభినందించుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువే. ఎన్టీఆర్ కొన్ని వందల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలలో ఏఎన్ఆర్‌కు మాత్రం ఒకే ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట. ఈ విషయాని ఎన్టీఆర్ కొడుకు నందమూరి బాలకృష్ణ ఓ సందర్భంలో వివరించారు. నాన్నగారు నటించిన అన్ని సినిమాల్లో ఏఎన్ఆర్ గారు ఒకే ఒక్క సినిమాకు అభిమానిని అయ్యాను అంటూ చెప్పారని.. బాలయ్య వివరించాడు. ఆ మూవీ మరేదో కాదు ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం.
ఈ సినిమాలో ఎన్టీఆర్ రావణుడిగా నెగిటివ్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో శ్రీరాముడు పాత్రలో హరినాథ్, సీతాదేవి పాత్రలో గీతాంజలి మెరిసారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో నటించిన సరే.. హీరోల హైలెట్ అయ్యాడు అంటూ ఏఎన్ఆర్ ప్రసంసలు కురిపించారట. ఈ సినిమాలో ఎన్టీఆర్.. రావణాసురుడి పాత్రలో తన నటనతో ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నారట. ఇదే విషయాన్ని బాలయ్య చెబుతూ.. తనకు కూడా ఓ సినిమాలో నెగటివ్ రోల్ నటించాలని ఉందని.. మంచి పౌరాణిక సినిమా అయితే నెగటివ్ రోల్ చేయడానికి నేను కూడా సిద్ధమంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు.