‘ విశ్వంభర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ నిరాశలో ఫ్యాన్స్.. కారణం ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా మూవీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వారి నిరీక్షణకు త్వరలోనే తెర‌ప‌డ‌నుంది. అఫీషియల్ గా మేకర్స్‌ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ‌శిష్ఠ డైరెక్షన్‌లో సోషియ ఫాంటసీ డ్రామాగా.. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న‌ ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదట్లో మంచి అంచనాల నెలకొన్న.. సినిమా టీజర్ తర్వాత సినిమాపై హైప్‌ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కారణం సినిమా గ్రాఫికల్ వర్క్స్ నాసిరకంగా ఉండటమే. ఈ క్రమంలోనే ఎన్నో ట్రోల్స్ ను కూడా సినిమా ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అభిమానంలో టెన్షన్ మొద‌లైంది. నిజానికి సినిమా జనవరి 10న రిలీజ్ కావాల్సి ఉండగా.. గేమ్ ఛేంజ‌ర్‌ కోసం సినిమాను వాయిదా వేశారు.

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' మూవీ HD స్టిల్స్ (ఫోటోలు) | Mega Star  Chiranjeevi Vishwambhara Movie Stills photos | Sakshi

ఈ క్రమంలోనే మూవీ కోసం చాలా టైం దొరకడంతో గ్రాఫిక్స్ పై కాన్సన్ట్రేట్ చేసి.. బలంగా మార్పులు, చేర్పులు చేశారట మేకర్స్‌. క్వాలిటీ పరంగా సినిమా ఆకట్టుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక సినిమాను కచ్చితంగా ఆగస్టులో రిలీజ్చేయ‌ను8న్నార‌ట‌. అయితే సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా ఆగ‌స్టు 14న‌రిలీజ్ కాకుంటే.. విశ్వంభర ని అదే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే.. నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేసేలా టీం భావిస్తున్నర‌ట‌. అయితే ఆగస్టు నెలలో ఏ తేదీన రిలీజ్ చేసిన నో అబ్జెక్షన్ కానీ.. ఆగస్టు 22న మాత్రం అసలు రిలీజ్ చేయొద్దు అంటూ మెగా అభిమానులు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.

Chiru's Vishwambhara Teaser: Cinematic Marvel

కార‌ణం అదే రోజు మెగాస్టార్ బ‌ర్త్‌డే కావడం. అయితే.. బర్త్డే రోజున సినిమా రిలీజ్ చేస్తే అది మంచిదే కదా.. ఎందుకు వద్దనుకుంటున్నారు అనే సందేహాలు అందరికీ రావచ్చు. ఓ సినిమా రిలీజైన‌ కొద్ది గంటల్లోనే సినిమా నుంచి రివ్యూస్ వస్తున్నాయి. మెగాస్టార్ ను అభిమానించే ఆడియన్స్ ఎంతలా ఉన్నారో.. ద్వేషించే జనం కూడా అదే రేంజ్ లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ నుంచి సినిమా వస్తే ఆయనను ట్రోల్స్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కనుక.. మెగాస్టార్ పుట్టిన రోజున ఇలాంటి ట్రోల్స్‌ను ఎదురుకోవడం మాకు ఇష్టం లేదు.. దయచేసి ఆగస్టు 22న మాత్రం సినిమా రిలీజ్ చేయవద్దంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.