టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలలో క్షణం తీరికలేకుండా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో చరణ్ పార్లమెంట్లోకి అడుగుపెట్టబోతున్నాడా.. ఇంతకీ ఆయనకు అంత అవసరం ఏమి వచ్చింది.. ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్నాడా.. లేదా ఇంకా ఏదైనా రాజకీయ వ్యవహారమా.. అసలు రామ్ చరణ్ కు పార్లమెంట్ లో పనేముంది అనే సందేహాలు అందరిలోనూ మొదలై ఉంటాయి. కానీ.. రామ్ చరణ్ పార్లమెంట్‌కి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవమే అయినా.. దాని వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు లేవట. కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే ఈ సినిమా టీం పార్లమెంటును ఒక్కరోజు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పుడు నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్. చరణ్.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసింది. పెద్ది వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ లాంటి ఘోర డిజాస్టర్ తర్వాత కూడా చరణ్ క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చరణ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టి.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో కుస్తీ పోటీలకు సంబంధించిన సీన్స్ రూపొందుతున్నాయి. అయితే ఈ సినిమాలో అత్యంత కీలకమైన సీన్స్ అన్ని పార్లమెంట్లోనే జరగనున్నాయని.. సన్నివేశం చూసే ఆడియన్స్ కు నాచురల్ గా అనిపించాలనే ఆలోచనతో పార్లమెంట్ ఒక్కరోజు షూటింగ్ కోసం తీసుకోవాలని టీం భావిస్తున్నారట.
గతంలో తేలికగా షూటింగ్ కోసం పార్లమెంటును ఇచ్చేసేవారు. కానీ.. ఇప్పుడు అంత సులభం కాదు. దాని కోసం ఎన్నో అనుమతులు, ఎన్నో చిక్కులు దాటుకోవాలి. మూవీ టీంకు ఎంత కష్టపడినా అనుమతుల విషయంలో వర్కౌట్ అవ్వడం లేదు. ఈ క్రమంలోనే మూవీ టీం పవన్ ను అప్రోచ్ అయ్యారని.. పవన్ కు ఢిల్లీలో ఉన్న పలుకుబడితో ప్రత్యేక అనుమతులు వచ్చేలా రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్లమెంటును ఒక్కరోజు షూటింగ్ కోసం ఇప్పించేలా పవన్ కూడా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడట. ఇక ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందుతుంది. కాగా తన కెరీర్‌లోనే సినిమా ద బెస్ట్ అవనుందని రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు.