నయన్‌ను బీట్ చేసిన సాయి పల్లవి.. ఈ క్రేజ్ ఏంట్రా సామి..?

ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నా.. చాలామంది సీనియర్ ముద్దుగుమ్మల క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు. ఇప్పటికి వారి రెమ్యునరేషన్ను పెంచుకుంటూనే పోతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ను చూస్తే వామ్మో అనకామనరు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మగా నయనతార మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో జవాన్ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాకి ఏకంగా రూ.12 కోట్ల రెమ్యూనరేషన్లు ఛార్జ్ చేసింది. అయితే ఇప్పుడు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆమె రికార్డును బ్రేక్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.

Nayanthara

ప‌ల్ల‌వి నటించిన సినిమాల స‌క్స‌స్ రేట్ అధికంగా ఉండడం కూడా రెమ్యూనరేషన్ పెంచడానికి కారణం కావచ్చు. ఇటీవల తమిళ్లో శివ కార్తికేయన్ జంటగా నటించిన అమరాన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిందో తెలిసిందే. తర్వాత నాగచైతన్య తండేల్‌ సినిమాతోను సక్సెస్ అందుకుంది. ఇలా సాయి పల్లవి వరుసగా బ్లాక్ బాస్టర్లు అందుకోవడంతో.. మ‌రిన్ని మంచి ప్రాజెక్టులకు క్యూ కడుతున్నాయి. ఇక‌ ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Sai Pallavi's top 9 must-watch movies to add to your watchlist |  EconomicTimes

రణ్‌బీర్‌ కపూర్ రాముడిగా, య‌ష్ రావ‌ణిడిగా చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అంతేకాదు రామాయణం సినిమాపై భారీ అంచనాలు ఆడియన్స్‌లో నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. మొదటి భాగంలో సాయి పల్లవి సీత పాత్ర కోసం ఏకంగా రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సౌత్లోనే కాదు నార్త్ లోను సాయి పల్లవి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నయనతార రికార్డులను బ్రేక్ చేస్తూ సాయి పల్లవి పాపులరిటీతో దూసుకుపోతుందంటూ.. ఈ క్రేజ్‌ ఎంట్రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్‌ వైరల్‌గా మారుతున్నాయి.