టాలీవుడ్ స్టార్ నటి జయసుధకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలనాటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రలో నటిస్తూ రాణిస్తుంది. ఇలాంటి క్రమంలో జయసుధకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. గతంలో జయసుధ హీరోయిన్గా కొనసాగుతున్న క్రమంలో.. ఆమె భర్త దగ్గరకు ఓ హీరో స్వయంగా వెళ్లి నేను నీ భార్యని పెళ్లి చేసుకుంటానని అడిగాడంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. జయసుధ భర్త రియాక్షన్ ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం. ఆ హీరో మరెవరో కాదు.. జె.డి చక్రవర్తి.
టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలను నటించి ఆకట్టుకున్న ఆయన.. జయసుధతోను పలు సినిమాల్లో నటించాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన దెయ్యం మూవీ షూట్ టైంలో జయసుధను పెళ్లి చేసుకుంటానని.. ఆమె భర్త దగ్గరికి వెళ్లి జె.డి చక్రవర్తి అడిగారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే రివీల్ చేశాడు. జయసుధ గారికి నేను పెద్ద ఫ్యాన్. దెయ్యం సినిమా షూట్ టైంలో తన భర్త నితిన్ సెట్స్ కి వచ్చారు. నేను వెళ్లి నాకు జయసుధ గారిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగా.. అతను 6’3 హైట్ ఉంటాడు. లాగి కొడితే మూడు నెలలు వరకు లేవం.
అయినా చాన్స్ తీసుకున్న నేను సరదాగా మాట్లాడుతానని ఆయనకు తెలుసు. నేను అలా అడిగేసరికి.. అతను ఓ డేట్ చెప్పి ఆరోజు పెళ్లి చేసుకో అన్నాడు. నేను షాక్ అయిపోయా. ఏ.. ఎందుకు.. అంటే ఆరోజు మా పెళ్లి రోజు కూడా.. పెళ్లి రోజు ఒకటే ఉంటుంది. భర్త మారతాడు అంటూ కామెంట్స్ చేశాడని.. అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి షాక్ అయ్యా అంటూ చెప్పుకొచ్చాడు జెడి చక్రవర్తి. ఇక జయసుధ భర్త నితిన్ కపూర్ బాలీవుడ్ ప్రొడ్యూసర్. అక్కినేని నాగేశ్వరరావు – జయసుధ హీరోయిన్లుగా ఆదిదంపతులు సినిమాకు నితిన్ కపూరే దర్శకుడుగా వ్యవహరించారు. అంతేకాదు పలు తెలుగు సినిమాలకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఆయన.. 2017లో బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయారు.