తారక్ – ప్రశాంత్ మూవీపై అంచనాలు పెంచేసిన ప్రొడ్యూసర్.. ఇంటర్నేషనల్ మూవీ.. పిచ్చ కాన్ఫిడెంట్ అంటూ..

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ దేవరతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వార్ 2 సినిమా షూట్ లో బిజీగా గ‌డుపుతున్న ఆయన అతి త్వరలో.. మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్‌లో అడుగుపెట్ట‌నున్నాడు. ఇక‌ తాజాగా ప్రశాంత్ మూవీ రెగ్యులర్ షూటింగ్ను కూడా ప్రారంభించి షూటింగ్ లోకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. దీనిపై ఆడియన్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్‌ షూట్ జరుగుతున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించారు. సినిమాకు అధికారికంగా టైటిల్స్ అనౌన్స్ చేయకున్నా.. ప్రస్తుతం డ్రాగన్ టైటిల్ లో పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న మైత్రి నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

ప్రదీప్ రంగనాథ్ రిట‌ర్న్ ఆఫ్ డ్రాగెన్ మూవీ సినిమా తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.100 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఈ మూవీని తెలుగులో మైత్రి నిర్మాతలు రిలీజ్ చేశారు. తాజాగా గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మైత్రి నిర్మాత మాట్లాడగా.. ఎన్టీఆర్ – నీల్‌ సినిమాకు ఏం టైటిల్ పెట్టబోతున్నారు,, డ్రాగన్ అనే పేరు వినిపిస్తున్న.. ఆల్రెడీ తమిళ్ లో ఆ టైటిల్ తో ఈ సినిమాలో రిలీజ్ చేసేసారు క‌దా.. ఇంతకీ ఆ సినిమా చెప్పిన టైం కు రిలీజ్ అవుతుందా.. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది.. అంటూ రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి నిర్మాత రవిశంకర్.. ఎన్టీఆర్ – నీల్‌ సినిమా.. ఇండియన్ స్క్రీన్ లోనే ఇప్పటివరకు చూడని ఓ వినూత్నమైన కథ‌.

ఆకాశమే హద్దుగా తెర‌కెక్కనుంది. ప్రాజెక్టు పై పిచ్చి కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మీరు ఊహించిన దానికంటే కచ్చితంగా ఎక్కువ కలెక్షన్సే వస్తాయి. ఆ సినిమా ఒక హై వోల్టేజ్ యాక్షన్ తో కూడిన డ్రాగన్. ఈ సినిమాకు దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేరే లెవెల్ మూవీ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో రిలీజ్ చేసే సినిమా అది. పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తాన్ని చుట్టేస్తుంది.. చెప్పిన టైంకే రిలీజ్ చేస్తాం అంటూ వివరించాడు. దీంతో ఎన్టీఆర్, నీలి సినిమాకు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అని ఇన్ డైరెక్ట్‌గా నిర్మాత హింట్ ఇచ్చేశారు. అలాగే సినిమా గురించి ఆయన చేసిన కామెంట్స్ సినిమాపై భారీ అంచనాలను నెల‌కొల్పుతున్నాయి. 2026 జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అంటే వచ్చే ఎడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.