టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ దక్కించుకొని రాణిస్తున్న సంగతి తెలిసిందే. వృత్తిపరంగా సినిమాలతో ప్రశంసలు దక్కించుకున్న ప్రభాస్.. వ్యక్తిగతంగాను అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ప్రభాస్ విషయంలో అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే.. అది ఆయన పెళ్లి. ముదురు వయసులోనూ ఇంకా వివాహం చేసుకోకుండా సోలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే ఆయన పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా.. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మంచు డాటర్ లక్ష్మి.. ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మంచు ఫ్యామిలీకి.. ప్రభాస్‌కు మధ్య మంచి బాండ్ ఉన్న సంగతి తెలిసిందే.
బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబుతో కలిసి ప్రభాస్ నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు.. హీరోయిన్ అన్నగా నటించగా.. ప్రభాస్ బావా అని పిలుస్తూ ఉంటాడు. అప్పటినుంచి సినిమా షూట్ పూర్తయిన ఇప్పటికీ కూడా మోహన్ బాబును ప్రభాస్ ఎక్కడ కలిసిన బావా అనే సంభోదిస్తాడంటూ మంచి లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఆయన ఏం అడిగినా కూడా ప్రభాస్ అసలు కాదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మంచి విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో కూడా రుద్ర పాత్ర కోసం ప్రభాస్ ని సంప్రదించగానే.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాదు సినిమాలో చేసేందుకు ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని మంచు విష్ణు ఇటీవల ఓ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఇక మోహన్ బాబు, ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఉన్న క్రమంలో మంచి లక్ష్మి.. ప్రభాస్ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ 2025 చివరికి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నా ప్రభాస్ నుంచి మాత్రం ఇప్పటివరకు పెళ్లి పై ఒక శుభవార్త కూడా రాలేదు. అయితే ఇటీవల ఆయన పెళ్లి ఫిక్స్ అయిందని అమ్మాయి కూడా గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయని ప్రభాస్‌కు బంధువు అతుందని వార్తలు వినపడుతున్నాయి. ఇలాంటి క్రమంలో మంచు లక్ష్మి ఏడాది చివర్లో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చేసిన కామెంట్స్ మరింత ట్రెండింగ్‌గా మారాయి.