ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా సుమన్ ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న చిరు, బాలయ్య, నాగ్, వెంకీలకు గట్టి పోటీ ఇస్తూ.. తన అందంతో ఆకట్టుకున్నాడు సుమన్. కాగా తన లైఫ్‌లో జరిగిన ఒక్క మిస్టేక్ తో పూర్తిగా కెరీర్ డౌన్ ఫాల్ అయిపోయింది. తిరిగి స్టార్‌గా రాణించాలని ఆయన ఎంత ఆరాటపడినా.. అస్సలు తన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మారాడు. అయినా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఒక అమ్మాయి, తన ఫ్రెండ్ విషయంలో సీఎం, డిజిపి, కాంట్రాక్టర్లు కలిసి చేసిన కుట్రకు సుమన్ బలైపోయాడని అంటారు.
అయితే ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం తిరిగి స్టార్ స్టేటస్ ని దక్కించుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. ఆ ఫలితాలు అన్నీ విఫలమవుతూనే వచ్చాయి. కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది అనుకునే సమయంలో.. ఒక్క సినిమా సుమన్‌కు సెకండ్ లైఫ్ ఇచ్చింది. ఆయన కెరీర్‌ను యూటర్న్ తిప్పి.. మళ్లీ పరుగులు పెట్టించింది. దీని అంతటికి ఒక స్టార్ హీరో తీసుకున్న నిర్ణయమే కారణమట. సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా.. ఏది సక్సెస్ అందించలేదు. అయితే ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్ ఇచ్చినా సినిమా ఏంటి అంటే టక్కున అన్నమయ్య సినిమానే గుర్తుకొస్తుంది.
ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ ఒదిగిపోయినటించారు. కే. రాఘవేంద్ర డైరెక్షన్లో నాగార్జున హీరోగా నటించిన సినిమాలో మొదటి శ్రీవారి పాత్ర కోసం శోభన్ బాబును భావించారట. అయితే ఆయన అప్పటికి రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఆ నిర్ణయం పై కట్టుబడి రాఘవేంద్రరావు ఎన్నిసార్లు అడిగినా.. నేను చేయను అంటే చేయనని చెప్పేసాడట. దీంతో ఆ పాత్రకు మరెవరు సరిపోరు అని మాట్లాడుకున్న సమయంలో నాగార్జున, రాఘవేంద్ర రావు మధ్య సుమన్ డిస్కషన్ రావడం.. ఆయన అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయనను తీసుకున్నారు.
ఇక ఈ సినిమాలో నాగార్జున తర్వాత అదే రేంజ్ ఇమేజ్ సుమన్ కు దక్కింది. వెంకటేశ్వర స్వామి స్వయాన దిగివచ్చారా అనేంతలా ఆయన పాత్రలో ఇమిడిపోయాడు. దెబ్బతో కెరీర్ మళ్ళీ యూ టర్న్ తిరిగింది. వరుసగా బలమైన పాత్రలో అవకాశాలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే రజనీకాంత్ శివాజీలో విలన్ పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇది సుమన్ కెరీర్‌కు మరింత బూస్టప్ ఇచ్చింది. అలా.. శోభన్ బాబు తీసుకున్న ఒక నిర్ణయం సుమన్ కు సెకండ్ లైఫ్ వచ్చింది. అదే ప్రభావంతో ఇప్పటికీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమన్ కొనసాగుతూనే ఉన్నారు.