దేవర 2లో ఆ స్టార్ హీరో కూడానా.. దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇది..!

టాలీవుడ్ యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మిక్స్డ్‌ టాక్ తోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం సృష్టించింది దేవర. మొదటి ఆడియన్స్‌కు సినిమా ఎక్కకపోయినా.. మెల్లమెల్లగా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే దేవరకు కంటిన్యూగా రానున్న.. దేవర 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

Devara Part 2': Kortala Siva plans to rope in Ranbir Kapoor or Ranveer Singh in the film - Times of India

ప్రస్తుతం దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పనుల్లో కొరటాల శివ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా దేవరను మించిన బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట కొర‌టాల‌. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన దిమ్మతిరిగే అప్డేట్ ఒకటి నెటింట వైరల్ గా మారుతుంది. దేవర 2 స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు టీం తో కలిసి కష్టపడుతున్న కొరటాల.. పార్ట్ 2 కథ విషయంలో చాలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగానే బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ను ఈ మూవీలో భాగం చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే.. ర‌ణ్‌వీర్ కోసం ఓ ప్రత్యేక రోల్‌ కూడా డిజైన్ చేశాడని సమాచారం. ఈ వార్తల్లో వాస్తవంతో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే బాలీవుడ్‌తో పాటు.. పాన్ ఇండియా ఆడియన్స్ భారీ లెవెల్ లో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతారు అనడంలో సందేహం లేదు. కాగా వచ్చేయడానికి జనవరి చివరి నుంచి దేవర 2 సెట్స్ పైకి రానుంద‌ని సమాచారం. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా షూట్ తో పాటు.. ప్ర‌శాంత్ నీల్‌ సినిమాను కూడా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేసి దేవ‌ర 2 సెట్స్ లోకి అడుగుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నాడట.