టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు .. వరుసగా మూడు సినిమాలను ఓకే చేసి బ్రేక్ లేకుండా షూటింగ్స్ లో ఉంటున్నారు .. ప్రజెంట్ రౌడీ హీరో చేతిలో ఉన్న మూడు సినిమాల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ లింక్ సిమిలారిటీ కూడా ఉంది .. అది ఏంటి అనేది కూడా ఈ స్టోరీలో చూద్దాం. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఒకేసారి మూడు సినిమాలను ఓకే చేశాడు .. ప్రస్తుతం గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు .
ఈ సినిమాలు విజయ్ స్పైగా నటిస్తున్న ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో తెర్కక్కుతుంది .. ఇప్పటివరకు స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ఈ రౌడీ హీరో ఈ సినిమా కోసం పూర్తిగా తన మేక్ కవర్‌ను మార్చేశాడు. అదేవిధంగా ఎస్‌వీసీ బ్యానర్‌లో రాబోతున్న వీడి 13 కూడా పీరియాటిక్ యాక్షన్ డ్రామా గానే మొదలు పెట్టబోతున్నారు .. ఓ రివెంజ్ డ్రామా రాబోతున్న ఈ సినిమాలో వింటేజ్ మాస్ యాక్షన్ హీరోగా విజయ్ అని చూడబోతున్నాం. అదేవిధంగా వీడి 14 కోసం భారీ ప్రయోగమే చేస్తున్నాడు రౌడీ హీరో .
ఏకంగా 1800 కాలం నాటి యుద్ధ వీరుడుగా నటించేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు .. అందుకోసం హార్స్ రైడింగ్ , యుద్ధకళలు వంటి వాటిల్లో కూడా శిక్షణ తీసుకుంటున్నారు . వీడి 14 కోసం పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు రౌడీ హీరో.. ఇలా ఊహించిన విధంగా ఈ మూడు సినిమాలలో తన ఇమేజ్కు దూరంగా ఎంతో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఇక మరి ఈ సినిమాల తో అయినా విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.