ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న సివరపల్లి, గాంధీ తాత చెట్టు రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా సివరపల్లి వెబ్ సిరీస్‌లో హీరోగా.. గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్‌గా రెండు పాత్రల్లోనూ నటించి ఒకేరోజు వచ్చిన ఈ రెండు సినిమాలతోను ఆడియన్స్‌ను మెప్పించాడు. బాలీవుడ్‌లో హీరో రాజ్ కుమార్ రావ్.. మలియాళ హీరో ఫాహద్ ఫజిల్ బాటలో వైవిధ్యమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ రాణిస్తున్న రాగ్ మయూర్.. చదువుకునే సమయంలో స్టేట్ టాపర్. ప్రశాంతంగా చదువును పూర్తి చేసిన తర్వాత నటనపై ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సినిమాల గురించి రివ్యూస్ రాసే స్టేజ్ నుంచి.. ప్రస్తుతం అదే సినిమాల రివ్యూలలో తన గురించి రాయించుకునే రేంజ్‌కు ఎదిగాడు.
ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఇక రాగ్ నటించిన మొట్టమొదటి సినిమాతోనే ఆడియన్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. సినిమా బండి మూవీలో మారిడేష్ బాబు రోల్‌లో నటించి మెప్పించిన రాగ్ మయూర్.. తన న్యాచురల్ నటనతో పాటు.. కామెడీకి టైమింగ్ తోనూ ఆకట్టుకున్నాడు. సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అప్పటినుంచి తన సినీ కెరీర్‌లో భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కొనసాగుతున్న ఈయన.. భిన్నమైన జోనర్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే కీడాకోలా సినిమాలోను లాయర్‌గా.. బ్రహ్మానందం మనవడి పాత్రలో మెప్పించాడు. తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలోను కొత్త స్టాటప్ కంపెనీ పెట్టాలని ఆరాటపడే ఓ సగటు కుర్రాడి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు.
అతని పాత్రలు ఎంపిక చేసే విధానం ఒకదాన్ని మించి మరొకటి అనేంతలా ఆకట్టుకుంటాయి. భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ.. పాత్రలకు తగ్గట్టుగానే తనని తాను మలుచుకొని నటనతో మెప్పించిన రాజ్ మయూర్.. తాజాగా రిలీజ్ అయిన సీవరపల్లి సిరీస్‌లో అసలు ఉద్యోగం చేయడమే ఇష్టం లేకుండా ఓ పంచాయతీ సెక్రెటరీగా పనిచేస్తున్న పాత్రలో తన టాలెంట్ చూపించాడు. తన నటనతో అబ్బురపరిచాడు. మరో పక్క గాంధీ తాత చెట్టు సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ తనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతున్న రాగ్ మయూర్.. సినిమా బండి డైరెక్టర్ రూపొందిస్తున్న పరదా సినిమాతో పాటు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గరివిడి లక్ష్మి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటే ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ గీతా ఆర్ట్స్2 సినిమాలోను కి రోల్‌లో మెరవనున్నాడు.