టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేస్ తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న మస్తాన్ సాయి అనే వ్యక్తి పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, నేను విడిపోవడానికి కారణం అసలు ఆ మస్తాన్ సాయినే అంటూ.. లావణ్య పోలీసులను ఆశ్రయించడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే 200 మందికి పైగా అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వారి వీడియోలను రికార్డ్ చేశాడంటూ ఆరోపణలు వినిపించాయి.
ఏకాంతంగా అమ్మాయిలతో గడుపుతున్న వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేసి చాలామందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక లావణ్య కు చెందిన కొన్ని వీడియోలు కూడా మస్తాన్ రికార్డ్ చేశాడు. మస్తాన్ రికార్డ్ చేసిన ఆ వీడియోలను లావణ్య పోలీసులకు అందజేయడంతో పాటు.. అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో దాదాపు 200కు పైగా అలాంటి వీడియోలు ఉన్నట్లు ఈ దర్యప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
అంతేకాదు గతంలో డ్రగ్స్ కేసులను మస్తాన్ అరెస్ట్ చేశారు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు జైలుకు పంపించారు. ఇక గతేడాది రాజ్ తరుణ్ – లావణ్య వివాదం ఏ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసు పెద్ద దుమారమే రేపింది. ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసులో లోతుగా దర్యాప్తు చేశారు. రాజ్‌తరుణ్‌కు పలువురు హీరోయిన్‌లతో రిలేషన్ ఉందని.. గతంలో ఆమె ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటేనే ఇష్టమని. అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కేసులో పేర్కొంది.