ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ థీం తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్ స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలతో పాటు.. వారి పర్సనల్ విషయాలను కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుడ్డిది నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఈ బూరి బుగ్గల చిన్నారి ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరో భార్య కూడా.. ఇంతకీ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. అది కాస్త కష్టమేలేండి మేమే చెప్పేస్తాం.
తానే హీరోయిన్.. శోభిత ధూళిపాళ్ల. ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించే వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2023 మిస్ ఇండియా ఎర్త్ పోటీలకు భారతదేశ ప్రాతినిధ్యత వహించింది. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు 2016లో అనురాగ్ కస్యప్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. రామన్ రాఘవ్ 2.0తో బాలీవుడ్ ప్రేక్షకుల పలకరించింది.
తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలోను వరుస సినిమాల్లో నటించింది. 2024 డిసెంబర్ 4న చైతుతో ప్రేమ వివాహం చేసుకుంది. ఇక వీళ్ళ వివాహాం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నాగచైతన్య తండేల్ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నాడు. ఇక శోభిత తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. దీంతో పాటే.. తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించింది.