స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సౌందర్య కలిసి నటించిన సినిమాలలో దేవి పుత్రుడు ఒకటి. దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అపట్ల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణ ద్వారక ఆలయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఫాంటసీ డ్రామాగా సినిమాలు రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు మేకర్స్. నరేష్, అంజలా జవేరి, కోట శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలో కనిపించారు. ఇక ద్వాపరయుగంలో నీట మునిగిన ద్వారక కథను ఆధారంగా తీసుకొని సినిమాను రూపొందించారు. అయితే సినిమాలో శ్రీకృష్ణుడి పాట ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే.
ఇప్పటికీ ఈ సాంగ్ కు ఎంతమంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ సాంగ్ లో కనిపించిన చిన్నారికి సైతం మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దేవి పుత్రుడు సినిమాల్లో కనిపించి తన అమాయకపు లుక్‌తో ఆకట్టుకున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత సినిమాలో బాలనటిగా కనిపించిందే లేదు. ఇక ఈ అమ్మడి పేరే వేగా తమోటియా. 1985లో పుట్టిన ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. తర్వాత హీరోయిన్ గాను మారి.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో హౌస్ ఫుల్ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో గుర్తింపు రాలేదు. తెలుగుతోపాటు తమిళ, హిందీ లోను పలు సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ అందుకోలేక పోయింది.
దీంతో కొంత బ్రేక్ తర్వాత హీరో వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీ హ్యాపీగా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. కానీ.. ఈ సినిమా కూడా సక్సెస్ అందించలేకపోయింది. ఈ క్రమంలోనే ఆఫర్స్ తగ్గిపోవడంతో.. ఇండస్ట్రీకి దూరమైనా ఈ ముద్దుగుమ్మ.. చదువులు పూర్తి చేసి విదేశాల్లో ఉంటుంది. ఇక ఇండస్ట్రీకి దూరమైన.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్‌తో ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది వేగా. సినిమాలో బొద్దుగా, క్యూట్ గా అమాయకంగా ఆకట్టుకున్న వేగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. హాట్ బాంబుల కుర్రాళ్లను కవిస్తుంది.