అన్నా నీ ఫస్ట్‌క్రష్ ఎవరు.. భువనేశ్వరి ప్రశ్నకు బాలయ్య రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది. ఓ పక్కన సినిమాలతో పాటు.. మరో పక్క రాజకీయాల్లోనూ, అలాగే సేవా కార్యక్రమాలతోనూ మంచి పేరును సంపాదించుకుని దూసుకుపోతున్న బాలయ్య. తాజాగా బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే.. ఫుల్ జోష్‌లో బాలయ్య.. బోయపాటి శ్రీను డైరెక్ష‌న్‌లో అకండ 2లో నటిస్తున్నాడు. ఇక ఈ ఏడాది మొదట్లోనే గ్రాండ్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు.

Nara Bhuvaneshwari to Kuppam from today, to initiate development programs

దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటనతో పాటు.. ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను.. బాలయ్యకు ఈ పురస్కారం దక్కింది. ఇక అన్నకు పద్మభూషణ్ అవార్డు రావడంతో.. అన్న తరపున గ్రాండ్ పార్టీ ఇచ్చింది భువనేశ్వరి. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో గత శనివారం రాత్రి ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో నందమూరి, నారా కుటుంబాలతో పాటు.. బాలయ్య సన్నిహితులు, అలాగే చిన్ననాటి స్నేహితులను కూడా ఆహ్వానించారు. పలు సినీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా బాలయ్య బావ.. ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే బాలయ్యను తన అక్క, చెల్లెలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు సంధిస్తూ ఇరకాటంలో పెట్టేశారు. అలా భువనేశ్వరి బాలయ్య పై ఇంట్రెస్టింగ్ క్యూస్షన్స్ సందించారు. అన్న నీ ఫస్ట్ క్రష్ ఎవరు అంటూ బాలయ్యను భువనేశ్వరి అడిగిన ప్రశ్నకు.. బాలయ్య రియాక్ట్ అయిన విధానం ఆడియన్స్ లో నవ్వులు పూయిస్తుంది. భువనేశ్వరి అడిగిన ప్రశ్నకు బాలయ్య రియాక్ట్ అవుతూ.. దీనికి నా సమాధానం నాన్న గారి శ్రీ‌మ‌ద్‌విరాటపర్వం సినిమాలోని డైలాగ్. అది నాకు వర్తిస్తుంది అంటూ.. అంగడి అమ్ముకున్నంత మాత్రాన అందాన్ని ఆరాధించే కళాదృష్టి మాకు లేకపోలేదు అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం బాలయ్య రియాక్షన్ వైరల్ అవడంతో దీనిపై ఫ్యాన్స్ ర‌క‌ర‌కాలుగా రియాక్ట్ అవుతున్నారు.