టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్‌గా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటికే బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ రేర్ రికార్డులను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. తాజాగా బాక్స్ ఆఫీస్‌కు సరికొత్త బెంజ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.303 కోట్ల గ్రాస్ వసుళను కొల్లగొట్టి.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు గ్రాస్ దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది.
సీనియర్ నటులలో రూ.300 కోట్ల గ్రాస్ వసుళ్ళు అందించిన మొదటి హీరోగా వెంకి మామ ఆల్ టైం రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. నేటికీ ఈ సినిమా నాలుగో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా రాణిస్తూనే ఉంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, మెసేజ్.. ఇలా అన్ని భావోద్వేగాలను కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను డిజైన్ చేసిన అనిల్.. మరోసారి సక్సెస్ అందుకున్నాడు.
అటు నిర్మాతలు, పంపిణీదారులకు, ఎక్జిబ్యూటర్లకు కనివిని ఎరుగని రేంజ్ లో లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ సినిమా అనేక ప్రాంతాల్లో పాన్ ఇండియా సినిమాల్లో కలెక్షన్లను కూడా బ్రేక్ చేయడం విశేషం. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఓ ప్రాంతీయ సినిమా రూ.300 కోట్ల మైలు రాయి దాటడం అంటే సాధారణ విషయం కాదు. దాన్ని చేసి చూపించాడు వెంకీ మామ. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రదర్శించబడ్డా అన్నిచోట్ల లాభాల వర్షం కురిపించింది. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.