టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆత్మహత్య

తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కె.పి చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా కృష్ణ ప్రసాద్ చౌదరి తాజాగా గోవాలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో డ్ర‌గ్స్‌ వ్యవహారాలు బయటకు వినిపించాయి. అంతేకాదు.. పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి.

Kabali producer: డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్ట్ - HITTV

అలా.. గతంలో ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉన్న కేపీ చౌదరి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం.. ఆర్థిక సమస్యల కారణంగానే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు.. ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు. అయితే గతంలో కె.పి.చౌదరి టాలీవుడ్‌లో రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. అయితే.. ప్రస్తుతం ఆయన సూసైడ్ చేసుకోవడంతో.. చౌదరి నుంచి నాలుగు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసిన పోలీసులు చౌదరి కాల్ డేటా, వాట్సప్ చాట్లను విశ్లేషించడం మొదలుపెట్టారు.

KP.Choudhary was arrested in drugs | cinejosh.com

చౌదరికి సంబంధించిన సెల్ ఫోన్ డేటాతో పాటు.. గతంలో అరెస్ట్ అయిన వారి డేటాను కూడా వెరిఫై చేస్తున్నారట. ఇక ఈ కాల్ డేటాలలో ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లతో ఓ లిస్టు తయారు చేయనున్నట్లు సమాచారం. దీంతో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2023 జోన్ 14 డ్రగ్స్ కేసులో అరెస్టే అయిన కేపీ చౌదరి డ్ర‌గ్స్‌ కింగ్ పిన్.. నైజీరియా కు చెందిన డ్రగ్స్ పాడ్లర్ రాకేష్ రోషన్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.