అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతతో విడాకులు తర్వాత.. చాలాకాలం సోలో లైఫ్ లీడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి కొన్నాళ్ల డేటింగ్ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు చైతూ. అయితే వివాహానికి ముందే చాలా సార్లు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకంట చిక్కారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అభిమానులు మాత్రం వాటిని కొట్టిపడేస్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా పెళ్లి అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు చైతూ.
2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట ఒకటయ్యారు. సన్నిహితులు, అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్యలో ఈ పెళ్ళి జరిగింది. ఇక చైతన్య కెరీర్ విషయానికి వస్తే.. 2023లో వచ్చిన కస్టడి ఫ్లాప్ తర్వాత.. చైతూ మళ్లీ వెండితెరపై కనిపించిందే లేదు. కాగా చివరిగా దూత అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించి మంచి సక్సెస్ అందుకున్న చైతు.. తాజాగా తండేల్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా.. చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా తెగ కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే.. ఈ ఈవెంట్లో చైతన్య పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇక తండేల్ మూవీ బుజ్జితల్లి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతన్య.. సాయి పల్లవిని ఇదే పేరుతో పిలుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈవెంట్‌లో చైతుకి ఎదురైనా ఓ ప్రశ్నకు బదిలీస్తూ.. తను ఇంట్లో శోభితను బుజ్జితల్లి అనే పిలుస్తానని వివరించాడు. తండేల్ మూవీలో కూడా హీరోయిన్‌ను ఇలాగే పిలుస్తానని చెప్పుకొచ్చాడు.దీంతో శోభిత పై చైతన్యకు ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటూ.. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.