బాలయ్య నెక్ట్స్‌ సినిమాల లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాకే.. దర్శకులు వెళ్లే..!

నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుక్రమహర్దశ నడుస్తుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా అయన నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలవడం.. తాజాగా పద్మభూషణ్ అవార్డు దక్కడం.. మ‌రోపక్క‌ రాజకీయాల్లోనూ రాణించడం.. ఇలా ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇలాంటి క్రమంలోనే బాలకృష్ణ.. లక్కీ డైరెక్టర్ బోయపాటితో అఖండ లాంటి సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా.. బాలయ్య ఈ సినిమాతో పాటు దాదాపు 6 సినిమాలను లైన్లో పెట్టుకున్నాడని టాక్ నడుస్తుంది.

అసలు ఆ సినిమాల లిస్ట్ ఏంటో.. డైరెక్టర్స్ ఎవరో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2.. పూర్తయిన వెంటనే గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో ఓ సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న జైలర్ 2 సినిమాలో క్యామియో రోల్‌లో కనిపించనున్నాడట బాలయ్య. ఈ సినిమాకు నెల్స‌న్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే హిట్ ది ఫోర్త్ కేస్.. మూవీ లోను బాలయ్య నటించనున్నాడు అంటూ టాక్‌ నడుస్తుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య మరో సినిమాలో కనిపించనున్నాడట. బాబి కొల్లి డైరెక్షన్ లోను బాలయ్య సినిమా చేయనున్నట్లు సమాచారం.

Balakrishna : బాలయ్యకి హ్యాట్రిక్ ఇచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్  లో.. అదిరింది అంటున్న అభిమానులు.. | Balakrishna hat trick movies directors  boyapati srinu gopichand ...

అలాగే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మూవీలో కూడా ఓ చిన్న క్యామియో రోల్‌లో బాలకృష్ణ కనిపించనున్నట్లు టాక్‌ నడుస్తుంది. ఇలా బాలకృష్ణ వరుస పెట్టి ఏడు సినిమాల లైనప్‌తో ఫుల్ బిజీగా గడపబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా బాలయ్య హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న డాకు మహారాజ్ సినిమాకు ఎస్ఎస్ థ‌మన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. థ‌మన్ సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి రానున్న అఖండ 2 తాండవం సినిమాకు కూడా థ‌మన్‌ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాతో ఆయన మ్యూజిక్ బాలయ్యను ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తుందో వేచి చూడాలి.