పాన్ ఇండియాలో టాప్ స్టార్స్ హీరోల లిస్ట్‌లో ఎప్పుడు రెబల్ స్టార్ పేరు మొదట వినిపిస్తునే ఉంటుంది. తన తోటి స్టార్ హీరోలతో పోలిస్తే అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలు నటిస్తూ క్షణం తీరక లేకుండా బిజీ అయిపోయాడు ప్రభాస్. తన సినిమాలతో వందల కోట్ల బిజినెస్ చేయడమే కాదు.. వేలాది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇక ప్రభాస్ బాహుబలి సిరీస్ల తర్వాత వరుసగా ఐదు సినిమాల్లో నటిస్తే కేవలం వాటిలో సలార్, కల్కి సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్లుగా నిలిచినప్పటికీ మిగిలిన సినిమాల నిరం్మాతలకు కూడా అసలు నష్టాల బాట పట్టలేదు. తన తోటి హీరోలు సూపర్ హిట్ సినిమాలతో సమానంగా.. గ్రాస్ వసులను రాబట్టి తన సత్తా చాటుకున్నాడు ప్రభాస్.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారతదేశంలోనే అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న షారుక్, సల్మాన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోస్ కూడా ప్రభాస్ తర్వాతే అనే రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అలాంటి ప్రభాస్‌కి.. ఒకప్పుడు చాలానే అప్పులు ఉండేవట. ఇక ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత స్టార్ అవలేదు. అంతకు ముందు నుంచి ఆయన మంచి స్టార్ హీరో. అప్పట్లోనే కొన్ని సినిమాలుకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోకు అప్పులు ఎందుకు ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. కానీ.. స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి సినిమాను చేస్తున్నామంటూ డైరెక్టర్ రాజమౌళి ప్రకటించిన రోజులవి.. రాజమౌళి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ టైంలో ప్రభాస్.. రాజమౌళి సతీమణి రమారాజమౌళి దగ్గరకు వెళ్లి నాకు చాలా అప్పులు ఉన్నాయి. మా స్నేహితులు మిర్చి సినిమా చేద్దాం అనుకుంటున్నారు. స్టోరీ బాగుంది.. చేసుకోవచ్చా అని ఆమెను అడిగాడట. దానికి రమ రాజమౌళి రియాక్ట్ అవుతూ రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధం చేసి సెట్స్‌పైకి వెళ్లే లోపు చాలా సమయం పడుతుంది కదా.. నువ్వు చేసుకునిరా.. మరేం పర్లేదు అని ఆమె చెప్పిందని.. తర్వాత రాజమౌళిని కూడా ఓ మాట అడిగా సినిమాని చేశాను అంటూ వెల్లడించాడు. ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయినయి సినిమా కమర్షియల్ గా ఎలాంటి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై వస్తుందంటే అభిమానులంతా కాళ్లు కట్టుకుని మరి సినిమాను చూస్తారు. కాగా ప్రభాస్.. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ను దాటి హాలీవుడ్ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.