అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి తాజాగా నటించిన మూవీ తండేల్ ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండెల్ జాతర.. పేరుతో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో పాటు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొని సందడి చేశారు. మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈవెంట్లో నాగచైతన్య, సాయి పల్లవి, చందు మొండేటి, అల్లు అరవింద్, బన్నీ వాస్‌తోపాటు.. ఇతర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.
ఇక ఈ ఈవెంట్‌లో సందీప్ రెడ్డీ వంగా మాట్లాడుతూ.. కొందరితో పరిచయం లేకున్న చూసిన వెంటనే ఇష్టం ఏర్పడుతుంది. అలా నాకు చూతుని మొదటి సారి కేడి మూవీ సెట్‌లో చూసినప్పుడే అనిపించింది. అప్పటి నుంచే చైతు అంటే నాకు చాలా అభిమానం అంటూ వివరించాడు. ఇక సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి.. నేను అర్జున్ రెడ్డి సినిమా అనుకున్నప్పుడు.. మొదట హీరోయిన్గా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నా. మలయాళం లో సాయి పల్లవిని అప్రోచ్ కావాలని ఒక కోఆర్డినేటర్‌ని అడుగుతూ.. ఇదో రొమాంటిక్ మూవీ అని చెప్పా.
వెంటనే అతను సార్ ఆ అమ్మాయి గురించి మీరు మర్చిపోండి. కనీసం స్లీవ్ లెస్ డ్రస్సులు కూడా ఆమె వేసుకోదు అని సందీప్ రెడ్డి వంగతో ఆయన చెప్పినట్లు వెల్లడించాడు. కొంతమంది హీరోయిన్స్ పెద్ద ఆఫర్స్.. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ వస్తే.. గ్లామర్ పాత్రలు నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ.. ఈమె మొదటి నుంచి ఇప్పటివరకు ఏమాత్రం మారకుండా అలాగే ఉన్నారు.. అది సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.