స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ సినిమాలో నటించకపోయినా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు.. సరికదా ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు నెటింట వైరల్‌గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. గతంలో సమంత, అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలానికే వీరిద్దరూ మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. తాజాగా నాగచైతన్య హీరోయిన్ శోభితను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలోనే సమంత రెండో పెళ్లిపై వార్తలు మరింత జోరందుకున్నాయి. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకేలలో ఒకరైన రాజ్ నిడమొర్రును ప్రేమిస్తుందని.. అతనితో ప్రేమాయణం నడుపుతుందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి. ఇక సమంత.. ఇటీవల సిటాడాల్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాజ్ దర్శకత్వం వహించారు. అయితే దీనికంటే ముందు ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలు పడ్డారని.. అయితే రాజ్ నిడమూరుకి పెళ్లయిపోయిన.. ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చి సమంత వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది.
దీనిపై ఇప్పటివరకు సమంత గాని, రాజ్ గాని రియాక్ట్ కాలేదు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ గురించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను రివిల్ చేశారు. త్వరలోనే ఈ సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ఇలాంటి క్రమంలో సమంతతో కలిసి రాజ్ నిడమోరు తిరుగుతున్న పిక్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. చెన్నై ఛాంపియన్స్ టిమ్‌ను కొనుగోలు చేసి వారికి సపోర్ట్ చేస్తున్న సమంత.. ఆ టీం తో కలిసి తాజాగా ఫోటోలు దిగింది. ఈవెంట్‌లోనే రాజ చేతిలో చేయి పట్టుకొని మరీ తిరుగుతూ సందడి చేసింది. దీంతో సమంత దర్శకుడిని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ మరోసారి వార్తలు బయటకు వచ్చాయి. ఇదే ఫుల్ క్లారిటీ అంటూ పిక్స్ కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక దీనిపై సమంత, రాజ్ నిడమొరు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.