సినీ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి.. పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ఎలాంటి వారైనా హీట్లతో పాటు.. ఫ్లాప్ సినిమాలు కూడా ఎదురుకోక తప్పదు. ప్రతి ఒక్కరు సినిమా నుంచి బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని.. మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శ్రమిస్తూ ఉంటారు. అయితే ఏవో రకరకాల కారణాలతో ఒకసారి సినిమా ఫ్లాప్ అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో డిజాస్టర్ గానూ నిలుస్తాయి. అలా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకే ఫ్లాపులు తప్పలేదు. అలాంటిది ఈ జనరేషన్ హీరోలకు ఫ్లాప్ రావడంలో వింతేమి లేదు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమా ప్లాప్ అవడం ఫ్యాన్స్‌కు నిరాశ మిగిల్చింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి సంచలన సినిమా తర్వాత చరణ్ నుంచి మూడేళ్ల గ్యాప్ తో వచ్చిన ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. శంకర్ డైరెక్షన్‌లో సినిమా రూపొందింది.
అయితే దర్శకుడు పై ఉన్న నమ్మకంతో మరో సినిమాకి కూడా కమిట్ కాకుండా చరణ్ సినిమాపై మొత్తం ఫోకస్ చేశాడు. కానీ.. ఆయనకు ట్రోల్స్, అవమానాలు దక్కాయి. అలాంటి సంఘటనే తాజాగా జరిగింది. నిన్న రాత్రి హైదరాబాద్‌లో తండేల్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఈవెంట్ కి దిల్ రాజు కూడా గెస్ట్ గా హాజరయ్యాడు. అతను ప్రసంగం ఇచ్చే ముందు.. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈవెంట్లో దిల్ రాజు గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఒక్క వారంలోనే దిల్ రాజు సంచలనం సృష్టించాడు. ఒక సినిమాతో ఇలా ఇచ్చి.. ఇంకో సినిమాతో ఎక్కడికో తీసుకెళ్లి అంటూ.. చేతిని కిందకి పైకి చూపుతూ, మళ్లీ ఇన్కమ్ టాక్స్ అధికారులతో రైడింగ్.. ఇలా సంచలనంగా మారాడు అంటూ కామెంట్స్ చేశాడు.
అయితే అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ గేమ్ ఛేంజర్ సినిమాను అవమానించినట్లు అనిపించినా.. దిల్ రాజు మాత్రం అల్లు అరవింద్ కామెంట్స్‌కు పొట్ట పగిలేలా నవ్వుతూ కనిపించాడు. అల్లు అరవింద్.. దిల్ రాజుని దృష్టిలో పెట్టుకొని సరదాగా కామెంట్స్ చేసిన.. ఆ ఛాన్స్ ఇచ్చింది అతనే. కాబట్టి గేమ్ ఛేంజర్ సినిమా నవ్వులపాలు చేసింది కూడా దిల్ రాజునే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్‌లో పరోక్షంగా ఈవెంట్ కి వచ్చిన గెస్ట్లు కూడా గేమ్ ఛేంజర్‌పై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేస్తూ ఉండడం.. దానికి దిల్ రాజు నవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. ఒక సినిమా థియేటర్లో రన్నింగ్ లో ఉన్నప్పుడు.. ఫ్లాప్ అని చెప్పుకోవడం బ్యాడ్ లక్.
గేమ్ ఛేంజర్‌కి స్వయంగా నిర్మాతలు నెగటివ్ పబ్లిసిటీ చేసినట్లు అనిపించింది. హీరో పడిన కష్టానికి కనీసం గౌరవం కూడా లేకుండా.. అల్లు అరవింద్ బహిరంగంగా సంక్రాంతి సినిమా ఫలితాలపై వెటకారం చేస్తుంటే.. దానిని దిల్ రాజు ఎంజాయ్ చేయడం చరణ్ ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పిస్తుంది. సినిమా డిజాస్టర్, ఫ్లాప్ అయితే.. దానివల్ల చరణ్ ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిమానులు కూడా ఊహించి ఉండరు. అయితే చరణ్‌కు మాత్రం ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కొత్తేమి కాదు. కింద పడడం.. తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకొని ఎగతాళి చేసిన వాళ్లతోనే ప్రశంసలు అందుకోవడం అలవాటే. అన్ని కలిసి వస్తే ఈ ఏడాదిలో ఆయన అందరికీ స్ట్రాంగ్ గా ఇచ్చి పడేస్తాడు అంటూ అభిమానులు తమ కామెంట్లను తెలియజేస్తున్నారు.