మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ చేంజర్ ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ నటించిన ఆర్‌ఆర్ఆర్‌కు ముందు వినయ విధేయ రామ, తర్వాత వచ్చిన ఆచార్య సినిమాలు కూడా అదే రేంజ్ లో డామేజ్ చేశాయి. ఇక తనతో పాటు సమానమైన క్రేజ్ ఉన్న ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే.. కేవలం చరణ్ మాత్రమే పాత కమర్షియల్ సినిమా ఫార్మేట్ ను నమ్ముకొని మార్కెట్ను మరింతగా చెడగొటుకుంటున్నాడని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో చరణ్ ట్రాక్‌లోకి వచ్చాడని.. మరోసారి తన కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే ఇక నుంచి న్యూ ఏజ్ కాన్సెప్ట్ మాత్రమే ఎంచుకోవాలని చరణ్ ఫిక్స్ అయ్యాడట.
కథ నచ్చకపోతే.. అది ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ సినిమా అయినా నో చెప్పేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్‌తో సినిమా చేయనున్నాడు. కాగా.. తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా – చరణ్‌ను కలిసి ఓ స్టోరీ లైన్ లో వినిపించారని.. ఇది రామ్ చరణ్ కు చాలా నచ్చేయడంతో.. స్క్రిప్ట్ పూర్తి చేసి వినిపించమని చెప్పాడట. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా గ్రాండ్ గా మేకర్స్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. ఈ సమర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మూవీ కి షిఫ్ట్ అవుతాడని అందరూ భావించారు. కానీ.. ఆ ప్రాజెక్ట్ కంటే ముందే చరణ్ తో సందీప్ రెడ్డివంగా సరికొత్త ప్రాజెక్టు సెట్స్‌పైకి తీసుకురానున్నడని టాక్ ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. సందీప్ రెడ్డి మార్క్.. చరణ్ హీరోయిజంకి తోడైతే ఇక ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ కాయం. ఈ కాంబినేషన్ మాత్రమే కాదు.. భవిష్యత్తులో ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లాంటి టాప్ మోస్ట్ సౌత్ ఇండియన్ డైరెక్టర్లతో కూడా చరణ్ పని చేయబోతున్నాడని.. ఇవన్నీ కేవలం స్టార్ డైరెక్టర్ల క్రైజ్ చూసి కాకుండా కథలు నచ్చి ఫిక్స్ చేసుకున్నాడట చరణ్. ఇక నిజంగానే ఈ సినిమాలన్నీ సెటై.. సక్సెస్ వస్తే చరణ్ బౌన్స్ బ్యాక్ అయ్యి పాన్ ఇండియా లెవెల్‌లో మరోసారి సత్తా చాటుతాడు అనడంలో సందేహం లేదు.