టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా తెరకెక్కిన డాకు మహారాజ్‌తో వరుసగా నాలుగో సారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్నాడు. దశాబ్ధాలుగా హీరోగా రాణిస్తున్న బాలయ్య.. తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తన సినీ కెరీర్‌లో కొంతమంది హీరోయిన్లతో సినిమా సెట్స్ పైకి వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా.. గతంలో మిస్సయిన క్రేజీ కాంబోలో బాలయ్య – దీపిక పదుకొనే కాంబో కూడా ఒకటి.
బాలయ్య ఊరమాస్ నాట్ హీరో.. ఇక దీపికా పదుకొనే గ్లోబల్ బ్యూటీగా కుర్రాళ్ళను కంటి చూపుతోనే అల్లాడించేస్తుంది. అలాంటి వీరిద్దరి కాంబోలో.. ఓ సినిమా వచ్చి ఉంటే ఖచ్చితంగా అది సంచలనంగా మారేది అనడంలో అతిశయోక్తి లేదు. మొదట ఈ కాంబో విని ఇబ్బందిగా అనుకున్నా.. తర్వాత కాంబోలో సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి.. అభిమానులు కచ్చితంగా నెలకొంటుంది. అలా గతంలో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. డైరెక్టర్ అంతా సెట్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్‌లో దీపిక ఆ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేసింది.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. వీరసింహారెడ్డి. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. బాలయ్య కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో హనీ రోజ్ మరదలు క్యారెక్టర్ లో కనిపించింది. శృతిహాసన్ మరొక హీరోయిన్గా మెరిసింది. అయితే శృతిహాసన్ క్యారెక్టర్ లో ముందుగా గోపీచంద్.. దీపిక పదుకొనేను హీరోయిన్ గా పెట్టాలని అనుకున్నారట. కానీ దీపిక ఆఫర్ ను రిజెక్ట్ చేసిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అలా దీపికా – బాలయ్య కాంబోలో సినిమా మిస్ అయ్యింది.