టాలీవుడ్‌లో ఒకప్పుడు వరస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపిన హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకటి. దాదాపు టాలీవుడ్ హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయినా ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటుంది. అలా.. తాజాగా మరోసారి పూజా హెగ్డే వైరల్‌గా మారింది. ఎప్పుడు కూల్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాసు అంటూ మండిపడింది. ఇంతకీ అసలు విలేకరులు అడిగిన ఆ ప్రశ్న ఏంటో.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్న పూజకు.. తాజాగా వచ్చిన దేవ సినిమా మంచి సక్సెస్ అందించింది.
షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా.. జనవరి 31న గ్రాండ్గా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే పూజ షాహిద్‌తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో సినిమాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. అయితే ఇంటర్వ్యూ మధ్యలో ఓ జర్నలిస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్, హృతిక్, రన్‌బీర్, షాహిద్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించడానికి అదృష్టంగా భావిస్తారా.. ఆ సినిమాలకు మీరు అర్హులేనని అనుకుంటున్నారా.. అని ప్రశ్నించారు.
దానికి పూజ చాలా కూల్‌గా రియాక్ట్ అయింది. ఆ సినిమాలకు హీరోయిన్గా నేను అర్హురాలు అని కచ్చితంగా భావిస్తున్నా.. ఆయా సినిమాల్లో నన్ను ఎంచుకోవడానికి దర్శక, నిర్మాతలకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక అవకాశం వచ్చినప్పుడు దానికి అనుకూలంగా పనిచేసి ఆ పాత్రకు న్యాయం చేయాలి.. నేను అదే పని చేశా. మీరు దాన్ని అదృష్టం అనుకుంటే అనుకోండి నో ప్రాబ్లం అంటూ చెప్పుకొచ్చింది. అయితే పూజ అంత కూల్ గా సమాధానం చెప్పిన తర్వాత కూడా.. మళ్లీ ఆ జర్నలిస్ట్ మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు.. స్టార్ హీరోల సినిమాలు అయితేనే నటిస్తారా.. అని అడగడం.. స్టార్ హీరోల పైన వరుస ప్రశ్నలు వేయడంతో.. పూజా హెగ్డే అసహనం వ్యక్తం చేసింది. అసలు మీ సమస్య ఏంటి.. ఏం సమాధానం కావాలి అంటూ మండిపడింది.
దీంతో షాహిద్ వెంటనే కలుగజేసుకొని.. మ్యాటర్‌ని డైవర్ట్ చేశాడు. నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలు అంటే ఆయనకు చాలా ఇష్టం అనుకుంటా.. అతను కూడా ఆ హీరోల పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నారు.. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేశాడు. దాంతో ఆ టాపిక్ డైవర్ట్ అయింది. కాగా.. ప్రస్తుతం పూజ హెగ్డే చేసిన కామెంట్లు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే రెండు భారీ ప్రాజెక్టులలో అవకాశాలు దక్కించుకుంది. అందులో ఒకటి విజయ్ దళపతి జన నాయగన్, మరొకటి సూర్యా హీరోగా నటిస్తున్న రిట్రో. ఈ రెండు సినిమాలపై పూజ చాలా ఆశలు పెట్టుకుంది. అంతే కాదు ఆడియన్స్ లోనే ఈ సినిమాలపై మంచి అంచనాలున్నాయి. రెండు సినిమాలు రిలీజై రిజల్ట్ వచ్చాక అమ్మడి డెస్టిని ఎలా మారబోతుందో వేచి చూడాలి.