మెన్షన్ హౌస్, వసుంధర నాకు రెండు కళ్ళు.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం బాలయ్య వరుస సక్సెస్‌ల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. తాజాగా పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ద‌క్కించుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే నారా, నందమూరి ఫ్యామిలీలు ఒక ప్రైవేట్ పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాజాగా నారా భువనేశ్వరి ఈ ఈవెంట్‌లో బాలయ్యను.. మెన్షన్ హౌస్‌కి.. నీకు.. ఏంటా సంబంధం అని అడిగిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.

Nara Bhuvaneshwari Clears Up Misconception About Brother Balakrishna's Age  - RTV English

బాలయ్య మాట్లాడుతూ నా లైఫ్ లో అన్ని యాదృశ్చికంగానే జరిగాయని.. మెన్షన్ హౌస్ అలవాటు కూడా అలాంటిదే అంటూ వెల్ల‌డించాడు. అంతే తప్ప.. మాన్షన్ హౌస్‌తో ప్రత్యేకమైన బాండేమీ లేదని.. బాలయ్య చెప్పుకొచ్చాడు. అది నన్ను ప్రేమించిందని వెల్లడించడు. వసుంధర, మెన్షన్ హౌస్ నాకు రెండు కళ్ళు అంటూ బాలయ్య కామెంట్స్ చేశాడు. నాన్న అప్పట్లో నాకు పెద్ద ఇల్లు కట్టించారు.. ఆ ఏరియాలో అదే మొదటి ఇల్లు అని బాలయ్య చెప్పుకొచ్చాడు. ఆ ఇల్లు తనకు మెన్షన్ తో సమానమని.. ఆ మెన్షన్‌లో.. మెన్షన్ హౌస్ ఉంటుందని బాలయ్య చెప్పుకొచ్చాడు.

తాజాగా నారా భువనేశ్వరి ఇచ్చిన పార్టీలో ఈ కామెంట్లు చేశాడు బాలయ్య. ఇక బాలయ్య సినిమాల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి డైరెక్షన్‌లో రూపొందుతున్న అఖండ సీక్వెల్ పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాలయ్య రెమ్యునరేషన్ కూడా ఒక్కింత భారీగానే తీసుకుంటున్నట్లు.. గ‌త నాలుగు సినిమాల‌ క్రితం వ‌ర‌కు రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న బాలయ్య.. ప్రస్తుతం రూ.40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా బాలయ్యకు క్రేజ్ దక్కింది.