టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారింది ఎవరంటే ఠక్కున శ్రీ లీల పేరు వినిపిస్తుంది. ఒక్క సినిమాతోనే అది కూడా ఫ్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత.. వరుస ఆఫర్లను అందుకుంది. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోయింది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలో నటించి సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఫ్లాప్ సినిమాలను కూడా ఫేస్ చేసినా.. తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారంలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పి మక్కాం మార్చేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుందట.
అమ్మడి నెక్స్ట్ ప్లాన్ వేరే లెవెల్ లో ఉందంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఈ యంగ్ డాక్టర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం శ్రీ లీల తమిళ్ ఇండస్ట్రీపై కన్నేసిందని.. అంతేకాదు బాలీవుడ్ కి ఎంట్రీ కూడా ఫిక్స్ చేసుకునట్లు టాక్. అయితే అంతా బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు రావాలని ఆరాటపడుతుంటే.. టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌లో మక్కం పెట్టాలని భావిస్తుందని టాక్. అయితే శాశ్వతంగా కాదు. ఒక ఏడాది మాత్రమే లుక్ పక్క ఇండస్ట్రీలపై షిఫ్ట్ చేస్తుందట. ఈ ఏడాది అంత కోలీవుడ్, బాలీవుడ్ లను టార్గెట్ చేయనందుని సమాచారం. ఇప్పటికే ఓ తమిళ సినిమాలో నటించగా.. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. పరాశక్తి టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది శ్రీ లీల. ఇప్పుడు వరకు టాలీవుడ్‌ను ఆటాడుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళ్ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
అంతేకాదు బాలీవుడ్ ప్లాన్స్ కూడా భారీగానే వేసిందట. ఈ అమ్మడు ఇప్పటికే బీటౌన్‌లో రెండు మూడు సినిమాలకు సాయం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఏడాది రెండు ఇండస్ట్రీలో విజయ పథకం ఎగరవేయాలని చూస్తుంది శ్రీలీల. అయితే మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఇంకొన్ని సినిమాలు మాత్రమే శ్రీలీల చేయబోతుందని. తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన ఎంబీబీఎస్ చదువుకు న్యాయం చేసేలా వేరే డెసిషన్ తీసుకుందట. సినిమాలు ఆపేసి హాస్పిటల్ కట్టబోతుందని కూడా.. ఓ వార్త వైరల్ అవుతుంది. భారీ స్థాయిలో హాస్పటల్ నిర్మించే ప్లాన్లో ఈ యంగ్ బ్యూటీ ఉందట. డాక్టర్గా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తుందని.. సినిమాల నుంచి వచ్చిన సంపాదన హాస్పిటల్ కోసమే ఉపయోగించనుందని సమాచారం.