అతనికి శిక్ష పడాలి.. పడుతుంది.. కసితీరా పోస్ట్ పెట్టిన సమంత..!

స్టార్ హీరోయిన్ సమంత.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నా.. నెటింట‌ మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యత ఇస్తూ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తన సినిమాలతో పాటు.. వ్యక్తిగత వార్తలతోనూ ఎప్పటికప్పుడు మెరుస్తుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. మయోసైటిస్‌తోను సతమతం అయింది. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది. ముఖ్యంగా చైతూతో విడిపోయిన తర్వాత సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటున్న సమంత.. బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా సమంత మాజీ భర్త నాగచైతన్య హీరోయిన్ శోభిత‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లి పై వార్తలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఓ స్టార్ డైరెక్టర్‌తో ఈ అమ్మడు రిలేషన్ షిప్‌లో ఉందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సిటాడెల్ డైరెక్ట‌ర్ బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్లలో ఒకరైన రాజ్‌ నిడమర్రుతో ఈమె ప్రేమాయణం నడుపుతుందని.. చాలా కాలంగా డేటింగ్ లో ఉందంటూ.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి. వీటిపై ఎప్పుడు రియాక్ట్ కానీ సమంత.. తాజాగా ఓ షాకింగ్ ఘటనపై రియాక్ట్ అవుతూ కసితీరా పోస్ట్ పెట్టింది.

ఇటీవల ర్యాగింగ్ కారణంగా మరణించిన ఓ విద్యార్థి గురించి సమంతా రియాక్ట్ అయింది. జనవరి 15న తోటి విద్యార్థులు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఓ బాలుడికి న్యాయం జరగాలని.. బాధ్యులకు శిక్ష పడాలని.. సోషల్ మీడియా వేదికగా ఆమె రియాక్ట్ అయింది. ఈ సంఘటనపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్, ప్రముఖులు నెటిజన్లు కూడా బాధితుడికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో.. సమంత చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎదుటివారి నుంచి బెదిరింపులు, వేధింపులు అవమానకర చర్యలు ఎదురైతే.. వాటి గురించి భయపడకుండా బయటకు మాట్లాడాలి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఇతరులు సపోర్ట్ గా నిలవాలంటూ సమంత ఈ నోట్‌లో పేర్కొంది. తప్పు చేసిన ఆ వ్యక్తికి శిక్ష పడాలి.. పడుతుందంటూ.. చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్ గా మారుతుంది.