అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. మరికొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు.. బన్నీ వాస్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. అల్లు అర్జున్ ప్రొడక్షన్‌లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్‌తో పాటు.. చైతు, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఎప్పటికప్పుడు సాయి పల్లవి యాక్టింగ్, డ్యాన్స్‌పై తనతో నటించే కో స్టార్స్ ప్రశంసలు వర్షం కురిపించడం కామన్. అందులో భాగంగానే నాగచైతన్య కూడా సాయిపల్లవితో పోటీపడి డ్యాన్స్ చేయాలంటే కత్తిమీద సామే అంటూ చెప్పుకొచ్చాడు. కాగా తాజాగా సాయి పల్లవి.. నాగచైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. చైతుని ప్రశంసలతో ముంచేసింది. సినిమాలో ఓ కీలక సన్నివేశం ఉందని చైతు పర్ఫామెన్స్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది అంటూ సాయి పల్లవి వెల్లడించింది.
తను అద్భుతంగా నటించాడని.. వెంటనే నేను డైరెక్టర్ గారితో చెప్పా.. ఆ సీన్ లో తన పార్ట్ రీ షూట్ చేయమన్నా. ఎందుకంటే.. చైతు పర్ఫామెన్స్ కి నా పర్ఫామెన్స్ అస్సలు మ్యాచ్ కాలేదు.. నేను ఇంకా బాగా నటించాల్సిన అవసరం ఉందంటూ చెప్పానని.. సాయి పల్లవి వివరించింది. చైతు నటనకు న్యాయం చేయాలంటే నేను కూడా బాగా నటించాలని డిసైడ్ అయ్యా అంటూ సాయి పల్లవి వివరించింది. ప్రస్తుతం చైతన్యను ఉద్దేశిస్తూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.