టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సమానంగా డ్యాన్స్ చేయగల హీరోయిన్లు ఎవరు అంటే.. ప్రస్తుతం సాయి పల్లవి శ్రీల పేరే టక్కున వినిపిస్తుంది. ఇక శ్రీ లీల కమర్షియల్ సాంగ్స్ ఎన్నో నటించే ఆకట్టుకుంది. యంగ్ స్టార్ హీరోలతో ఛార్జ్ బస్టర్ సాంగ్స్ తో మెప్పించింది. సోషల్ మీడియాలోనూ శ్రీలీల డ్యాన్స్ వీడియోస్ తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ సామాన్యుడితో కలిసి చిందేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది.
ఏంటి శ్రీ లీలా సామాన్యుడితో డ్యాన్స్ వేయడమా.. అసలు ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా.. ఎస్ ఇది నిజమే. ఇప్పటివరకు ఎంతమంది స్టార్ హీరోలతో కలిసి చిందేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా వాచ్‌మెన్‌తో కలిసి డ్యాన్స్ స్టెప్పులతో అలరించింది. పబ్ నుంచి బయటకు వస్తూ.. వాచ్‌మెన్‌తో కలిసి స్టెప్పులు వేసిందా.. లేదా ఏదైనా షూటింగ్ స్పాట్ దగ్గర పనిచేస్తున్న సెక్యూరిటీతో కలిసి చందులేసిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆ వీడియో మాత్రం నెట్టింటి వైరల్ గా మారుతుంది.
ఈ వీడియోను స్వయంగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. వాచ్‌మెన్ బాబాయ్ రాక్స్ అంటూ.. నైస్ వీడియోస్ శ్రీ లీల గారు అంటూ.. శ్రీలీల ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఫాన్ అంటూ.. వాచ్‌మెన్‌ను కూడా వదలలేదా శ్రీలీల అంటూ ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శ్రీ లీల ఈ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసిన గంటల్లోనే లక్షల్లో లైకులు రావడం విశేషం. ఇక వ్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
View this post on Instagram