టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. సినీ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డీలపడింది. ఇలాంటి క్రమంలో చరణ్ నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ దృష్టి మళ్ళింది. ముఖ్యంగా డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేస్తున్న భారీ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు రంగస్థలం, దేవర, రోబో లాంటి బ్లాక్బస్టర్ సినిమాలకు పనిచేసిన రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకున్నాడు రత్నవేలు. ఈ సినిమాలో ముఖ్యమైన సీన్స్ కోసం ఓల్డ్ ఫిలిం నెగటివ్ రీల్ ఉపయోగించినట్లు.. దాంతోనే షూట్ జరుగుతుందని వివరించాడు. ఇది ప్రస్తుతం సాధారణంగా వినిపించని పద్ధతి. అయినా.. డైరెక్టర్ దీనిని ప్రత్యేకంగా ఉపయోగించినట్లు సమాచారం. కొన్ని దశాబ్దాల క్రితం సినిమాలు నెగటివ్ రీల్ ద్వారా షూట్ చేసేవారు. డిజిటల్ టెక్నాలజీ రాగానే ఆ పద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పారు. కానీ.. ఇప్పుడు బుచ్చిబాబు సన్న మరోసారి పాత సైలిని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నాడట.
అయితే మొత్తం స్పై సినిమాను ఈ పద్ధతిలో తీయడం కష్టం కనుక.. కొన్ని కీలక సన్నివేశాలను మాత్రమే షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే.. ఇలాంటి పాత పద్ధతితో సినిమా తీయడం పై మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రయోగాత్మక ప్రయత్నాలు అవసరమా అంటూ.. చరణ్ సినిమాలపైనే ఇలాంటి అన్ని ప్రయోగాలు చేస్తారు ఎందుకు అంటూ.. తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో.. చరణ్ మూవీ ఆకట్టుకుంటుందో.. లేదో.. వేచి చూడాలి.