ఓ సినిమా సక్సెస్ సాధించాలంటే మంచి కథ ఉంటే సరిపోదు.. దానికి తగ్గ హైప్ ఆడియన్స్‌లో క్రియేట్ అవ్వాలి. సినిమా ఎంత దమ్మున్న కంటెంట్‌తో వచ్చినా.. ప్రేక్షకుల వరకు అది రీచ్ అయితేనే సక్సెస్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమాకు ముందే సాంగ్స్, ట్రైలర్స్, టీజర్ అంటూ ప్రమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేస్తారు మేకర్స్. ఇక రిలీజ్ కి ముందు వచ్చిన సాంగ్స్, మ్యూజిక్ హిట్ అయిందంటే.. ఆల్మోస్ట్ సినిమా సక్సెస్ అందుకున్నట్టే. సినిమా నుంచి వచ్చే మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ఓ సినిమా చేసేటప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంచుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు.
ఇక మన టాలీవుడ్ లో లవ్ స్టోరీలకి పెట్టింది పేరు డిఎస్పీ. లవ్ స్టోరీ సినిమాలకు ఆయన అందించే సంగీతం ప్రేక్షకులను వేరే లెవెల్‌లో ఆకట్టుకుంటుంది. అది మెలోడీ అయినా.. మాస్ సాంగ్ అయినా.. ప్రేక్షకుడి హర్ట్ టచ్ చేశాల ఆయన మ్యూజిక్ ఇస్తాడు. ఇక తాజాగా నాగచైతన్య హీరోగా రూపొందిన తండేల్ సినిమాకు కూడా డిఎస్పీనూ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. హైలెస్సా అంటూ ఎక్కడ చూసినా ఇదే మ్యూజిక్‌తో మారుమోగిపోతుంది. అలాంటి చార్జ్ బస్టర్ అందించిన డిఎస్పీ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ కాదని తాజాగా మూవీ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ వెల్లడించాడు.
బన్నీ చెప్పడం వల్లే ఈ ఛాన్స్ డిఎస్పీకి వచ్చిందని.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ వివరించాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్‌ని పెట్టుకుందామని మా టీం చెబితే.. నేను వద్దని చెప్పా. కారణం పుష్ప 2 సినిమా, మా సినిమా పనులు ఒకేసారి మొదలయ్యాయి. దేవి పుష్ప 2 లాంటి ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నప్పుడు.. ఆ బిజీలో మన సినిమాకు న్యాయం చేయలేడు అనిపించింది. వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుందామని టీంకు చెప్పా.. డీఎస్పీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ నాన్న నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలకు చేసాం. కానీ.. పుష్ప 2 లాంటి సినిమా చేస్తున్న టైంలో ఇంకో సినిమాకు న్యాయం చేయలేమనిపించింది.
దేవిశ్రీని పుష్ప 2 వాళ్ళే లాగేసుకుంటారు.. మాకు టైం కేటాయించరని భావించా. అయితే తండేల్‌కి మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరిని తీసుకోవాలని అర్థం కాని క్రమంలో.. ఇంట్లో భోజనం చేస్తున్న టైంలో అల్లు అర్జున్ కి విషయం చెప్పా. ఎవరిని తీసుకోవాలో అర్థం కావట్లేదు.. దేవీని తీసుకుంటే మీరు ఇబ్బంది పెడతారు.. అతని తీసుకోవాలంటే నిన్ను, దర్శకుడిని అందరినీ ఒప్పించాల్సి ఉంటుంది. అందుకే వేరే వ్యక్తిని చూద్దాం అనుకుంటున్నా అని అల్లు అరవింట్.. బన్నీతో అన్నాడట. వెంటనే బన్నీ.. దేవినే బెస్ట్ చాయిస్. లవ్ స్టోరీలకు దేవీని మించినోడు మరొకడు ఉండడు.. అతనే తీసుకోండి అని చెప్పాడని.. దీంతో మేము డిఎస్పీని సంప్రదించం అంటూ అల్లు అరవింద్ వివరించాడు. ఇక చందు మొండేటి డైరెక్షన్‌లో చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.