ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సెలబ్రిటీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. వారి కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అలాంటి సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా నెటింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్.. వారి బాల్య జ్ఞాపకాలు త్రో బ్యాక్ థీంతో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అలా.. తాజాగా ఓ హీరోయిన్ స్కూల్ డేస్ ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళీ క్రేజీ హీరోయిన్.
ఈ అమ్మడు తెలుగులోను పలు సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. తను నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో అమ్మడికి గోల్డెన్ బ్యూటీగా ఇమేజ్ కూడా క్రియేట్ అయింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడికి.. సరిగ్గా కలిసి రావట్లేదు. చిన్నప్పుడే స్కూల్‌లో వన్ ఆఫ్ ది టాపర్గా నిలిచి చదువులో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, ఆభినయంతో ఆకట్టుకుంది. మలయాళంలో స్టార్‌డం వచ్చిన తర్వాత.. తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఆడియన్స్‌ను మెప్పించింది. ఫస్ట్ సినిమాతోనే తెలుగులో తనదైన ముద్ర వేసుకుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా మెరిసింది. అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. దీంతో తెలుగులో విరూపాక్ష, సార్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు పడ్డాయి. ఇక ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ స్వయంభులో హీరోయిన్గా కనిపించనుంది. ఈ నేపథ్యంలోనే సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నట్లుగా సంయుక్త తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాటే బాలయ్య అఖండ 2 సినిమాలోను ఓ కీలక పాత్రలో నటించనుంది సంయుక్త. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రాక్టీన్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే అమ్మడి చిన్ననాటి ఫొటోస్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.