చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది .. తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది .. రీసెంట్ గానే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది .. ఇక కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే .. ఈమె తండ్రి ప్రముఖ నిర్మాత కాగా ఈమి తల్లి ఒకప్పటి హీరోయిన్ .. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన కీర్తి మలయాళంలో బాలనటిగా మూడు సినిమాల్లో నటించింది .. ఆ తర్వాత గీతాంజలి సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది.. ఇక టాలీవుడ్ లో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. ఈ సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ప్రస్తుతం టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి .. చిన్న వయసులోనే ఓ స్టార్ హీరోకు కూతురుగా నటించింది .. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ హీరోకే లవర్ గా కూడా నటించింది. స్టార్ హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలో ఆ స్టార్ హీరో పిలిచి మరి తనను అంకుల్ అని పిలవద్దని మరీ చెప్పారట . ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు .. అతనే మలయాళ స్టార్ హీరో దిలీప్.. 2002లో దిలీప్ హీరోగా కుబేరన్ మూవీ వచ్చింది . ఈ సినిమాలో దిలీప్ కూతురుగా కీర్తి నటించింది .. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 2014లో వచ్చిన రింగ్ మాస్టర్ సినిమాలో దిలీప్ కు లవర్ గా నటించింది . అయితే రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
అయితే దిలీప్ తో హీరోయిన్గా నటించేందుకు తాను ఎక్కువగా ఆలోచించలేదని .. చిన్నతనం నుంచి అతని దగ్గరుండి చూస్తున్నానని అతడేమీ మారలేదని ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడని చెప్పుకొచ్చింది .. అయితే రింగ్ మాస్టర్ సినిమాలో నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ అని తెసుకుని పిలిచి తనకు ఓ మాట చెప్పారట.. చిన్నప్పుడు అంకుల్‌ని పిలిచేదాని ఇప్పుడు అలా పిలవద్దు కావాలంటే అన్నయ్య అని పిలవమని అన్నారట .. దీంతో సరే అన్నయ్య అని పిలిచినట్టు ఆమె గుర్తు చేసుకుంది. ఇలా కీర్తి సురేష్ దిలీప్ కు కూతురుగా లవర్ గా నటించచిన్న స్టార్ హీరోయిన్‌గా మలయాళం లో రికార్డు క్రియేట్ చేసింది.