సాధరణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ఎవరి వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎలాంటి మలుపు తిరుగుతాయి.. ఎవరు గెస్ చేయలేరు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి పదాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా.. తాజాగా ఆరుపదుల వయసున్న స్టార్ హీరోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయలు వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్న ఆ స్టార్ హీరో ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలోను స్టార్ హీరో పెళ్లి గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతలా ట్రెండ్ అవుతున్నా ఆ స్టార్ హీరో మరెవరు కాదు.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. ఇక ఎప్పటికప్పుడు అమీర్ తన సినిమాల విషయాలతో పాటు.. పర్సనల్ విషయాలతోనూ వైరల్ అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన పర్సనల్ విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే రెండు సార్లు భార్యలకు విడాకులు ఇచ్చేసిన అమీర్ జీవితంలోకి మళ్లీ కొత్త ప్రేమ ఎంట్రీ ఇచ్చిందని.. బెంగళూరుకు చెందిన అమ్మాయిని అమీర్ ఖాన్ పీకలోతుగా ప్రేమిస్తున్నాడని.. ఇటీవల ఆమెను తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశారని.. ఓ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆమె ఎవరనే వివరాలు బయటకు రాకున్నా.. అమీర్ ఖాన్ ప్రేమకు ఆయన కుటుంబ సభ్యులు అంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది.
ఇటీవల అమీర్‌ఖాన్ లవ్ యాప సినిమా ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తన కొడుకు జునైద్, ఖుషి కపూర్‌లతో ఎంత ఉత్సాహంగా కనిపించినా అమీర్ ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తను ఇప్పటికి రొమాంటిక్‌నే అంటూ చెప్పుకొచ్చాడు. నేను ప్రమాణం చేస్తున్నాను. చాలా రొమాంటిక్‌ని. ఇది తమాషాగా అనిపించొచ్చు. కానీ.. నా భార్యలను అడగండి అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు అందుకే నేను రొమాంటిక్ సినిమాలు చేస్తాను. నిజమైన ప్రేమను నేను నమ్ముతా. జీవితంలో ముందుకు వెళుతున్న కొద్ది ప్రేమ పై అవగాహన మరింతగా బలపడుతుందంటూ వివరించాడు. ఈ కామెంట్స్ తగ్గట్టుగానే ప్రస్తుతం అమీర్ పర్సనల్ లైఫ్‌లో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతుంది.