ఆ హీరో రేంజ్‌కి నా స్టోరీలు సెట్ కావు.. కారణం ఇదే.. అనిల్ రావిపూడి

దర్శకదీరుడు రాజమౌళి తర్వాత తెలుగులో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్గా అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. ప్రేక్షకులకి న‌చ్చే.. ఆడియన్స్ మెచ్చే కంటెంట్‌తో మెజారిటీ సినిమాలు చేస్తూ వరుస సక్సెస్‌లు అందుకుంటున్నాడు అనిల్. అలా తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. నెక్స్ట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా స్క్రిప్ ఫైనల్ అయినట్లు సమాచారం. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుందట‌. ఇలాంటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడంపై స్పందించాడు.

Is Anil Ravipudi directing Chiranjeevi's next? Here's what we know |  Exclusive

ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా హీరోగా.. వరల్డ్ వైడ్‌గా స్టామినా చూపిస్తే రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇలాంటి క్రమంలో తారక్‌కి సరిపోయే రేంజ్‌లో ఇప్పుడు నాకు స్టోరీలు లేవు.. నేను ఇప్పుడు చేస్తున్న జానర్‌లో నేను చాలా కంఫర్ట్‌గా ఉన్నా.. ఒకవేళ తారక్ తో సినిమా చేయాలంటే ఆయనకు సరిపోయే కథ రాయాల్సి ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్‌లో యూనివర్సల్‌గా అందరికీ నచ్చే విధంగా స్టోరీ వరల్డ్.. బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కథ రాసినప్పుడు కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తా అంటూ వివరించాడు. గత రెండు, మూడు సార్లు ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.

Jr. NTR Biography: Movies, Family, Career, News and Photos

కానీ.. ఏవో కారణాలతో అవి వర్కౌట్ కాలేదు. రెండు, మూడు ఏళ్ల తర్వాత మాత్రం చేస్తా అందరి హీరోలతో సినిమాలు చేయాలని నాకు ఉంది అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. వాళ్లను ఎగ్జైట్ చేసే కథ నేను రాసినప్పుడు.. వారికి నచ్చేలా చెప్తే మా కాంబినేషన్ సినిమాలు సాధ్యమవుతాయని అనిల్ రావిపూడి వెల్లడించాడు. ఇప్పటికైతే ప్రస్తుతం ఉన్న జోనర్‌లో నేను కంఫర్ట్‌గా జర్నీ చేస్తున్నానంటూ వివరించాడు. ఇక చిరంజీవి గారితో డిస్కషన్ అవుతున్నాయి. స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిన తర్వాత మేమిద్దరం ఎగ్జిట్ అయ్యే సమయంలో అది మెటీరియలైజ్‌ చేస్తాం. ఏ విషయమైనా ముందే చెప్పడం సరికాదు. అంతా సెట్ అయ్యాక అనౌన్స్ చేస్తే బాగుంటుంది అంటూ అనిల్ రావిపూడి వెల్లడించాడు. ప్రస్తుతం అనిల్ చేసిన కామెంట్లు నెటింట వైరల్‌గా మారుతున్నాయి.