ఒకప్పుడు వెండి తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బ్యాడ్ టైం ను ఫేస్ చేస్తున్నారు .. గతంలో భారీ సినిమాలు తో వచ్చిన క్రేజ్ ఇప్పటివరకు వారి కెరియర్ కు బాగా కలిసి వచ్చింది .. కానీ ఇకమీదట అవకాశాలు రావాలంటే మాత్రం అప్ కమింగ్ సినిమాలతో భారీ హిట్లు అందుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ హీరోయిన్స్ ఉన్నారు .. రాఘవేంద్రరావు సమర్పణలో పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ శ్రీలీలా.. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో పాటు తన డాన్స్ తో మంచి పేరు తెచ్చుకుంది .. ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత ధమాక, భగవంత్ కేసరి లాంటి మంచి విజయాలు వచ్చినా.. స్కంద, ఆదికేశవ లాంటి సినిమాలు ఈ అమ్మడి కెరీర్ ను పాతాళానికి పడేసాయి.
ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్ అవ్వడంతో అన్ని సినిమాలకు సరైన డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డారు గతంలో శ్రీ లీల .. ఈ విషయంలో అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి .. అలాగే అదే సమయంలో వరుస ప్లాప్ లతో కెరియర్ కూడా గట్టిగా ఇబ్బంది పడింది .. అయితే ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నా .. ఈ అమ్మడి తీరు మాత్రం మారటం లేదు .. ఇప్పుడు కూడా ఎడపాడ సినిమాలకు ఓకే చెప్పేసి డేట్స్ విషయంలో ఇబ్బంది పడుతుంది ఈ ముద్దుగుమ్మ .ఆమధ్య వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న పూజ హెగ్డే తర్వాత ఊహించిన విధంగా స్లో అయిపోయారు .
రాధేశ్యామ్ లాంటి సినిమాలు తన కెరియర్ను మలుపు తిప్పుతాయన ఆశలతో వచ్చిన అవకాశాలు వదులుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే టైంలో ఆమెకు యాక్సిడెంట్ జరగటం కూడా పూజా కెరియర్ కు చాలా గ్యాప్ వచ్చి పడింది .. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతుంది .. ఇప్పుడు మరోసారి పూజ కూడా తన పాత తప్పునే రిపీట్ చేస్తున్న టాక్ వినిపిస్తుంది. ప్రజెంట్ రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల రిజల్ట్ చూశాకే కొత్త సినిమాలకు ఒకే చెప్పాలనుకుంటుంది పూజా హెగ్డే .. అందుకే ఇప్పుడు తనకి వెతుక్కుంటూ వస్తున్న సినిమాలను కూడా ఈమె నో చెబుతుంది .. దీంతో మరోసారి పూజ కెరియర్ గాడి తప్పుతుందని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు.