మోక్షజ్ఞ డబ్ల్యూ మూవీ హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీని అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ డెబ్యు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక‌ తాజాగా సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందట. కుదిరితే ఇదే ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. మోక్షజ్ఞ సినిమాకు పూర్తి మేకోవ‌ర్‌తో సిద్ధమయ్యాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఫోటోల్లో అల్ట్రా స్టైలిష్ గా కనిపించిన మోక్షజ్ఞ డబ్యూ.. ప్రశాంత్ వర్మ సినిమాతో అని టాక్ వచ్చినా త‌ర్వాత‌.. ప్రశాంత్ వర్మ రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేశాడని.. తన అసిస్టెంట్‌తో సినిమా చేయిస్తానని.. తాను దర్శకత్వం వహించను స్టోరీని మాత్రమే ఇస్తానని.. రకరకాలుగా వ్యవహరించడంతో బాలయ్య ఆయన పై ఫైర్ అయినట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తాజాగా సిద్ధం అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే సినిమా సెట్స్‌ పైకి అడుగుపెట్టనుంది. ప్రశాంత్ వ‌ర్మ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నాడు. బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కసితో ఉన్నారని టాక్‌ నడుస్తుంది. సినిమాకు నిర్మాత ఎవరనేది ఇంకా పిక్స్ కాలేదు. కాగా సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ మీడియాను షేర్ చేస్తుంది. అది ఏంటంటే.. సినిమాలో మోక్షజ్ఞ జోడిగా ఒక క్రేజీ బ్యూటీ హీరోయిన్గా కనిపించనుందట. మొదట్లో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నట్టు వార్తలు వినిపించినా.. తాజాగా మోక్షజ్ఞకు మీనాక్షి చౌదరి అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No Other Option: Only Mokshagna For Prasanth Varma | No Other Option: Only  Mokshagna For Prasanth Varma

గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలతో బ్లాక్ బ‌స్టర్లు అందుకున్న ఈ అమ్మడు మోక్షజ్ఞకు పర్ఫెక్ట్ పెయిర్ అని.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అదిరిపోతుంది అంటూ ఓ పోస్ట్ నెటింట హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దీనికి అభిమానులంతా లైక్ చేస్తూ.. మీనాక్షి అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా బడ్జెట్ అక్షరాల రూ.100 కోట్లని టాక్ నడుస్తుంది. ఇక ఓ డెబ్యూ మూవీకి ఈ రేంజ్ బడ్జెట్ మూవీ అంటే సాధారణ విషయం కాదు. ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందనుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్‌కు ఆడియోస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన క్రమంలో ఫ్యాన్స్ మొత్తం ఫుల్ హ్యాపీ అవుతున్నారు.