చరణ్, బుచ్చిబాబు సినిమాకి క్లైమాక్స్ హైలెట్.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాను ఫాలో అవుతున్నారా..?

ఏ సినిమా అయినా బడ్జెట్‌కు సంబంధం లేకుండా సక్సెస్ సాధించాలంటే కచ్చితంగా కంటెంట్ ముఖ్యం. అంతేకాదు.. కంటెంట్‌తో పాటు.. క్లైమాక్స్ సీన్స్ కూడా అదే రేంజ్‌లో మెప్పించాలి. సినిమాకు క్లైమాక్స్ ప్రాణం పోస్తుందన‌టంలో సందేహం లేదు. సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ ఒక ఎత్తు అనేలా దర్శకులు కూడా సినిమాను ప్లాన్ చేస్తారు. అంతేకాదు.. క్లైమాక్స్ బాగుంటే సినిమాలు ఆడియన్స్ మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా ఇటీవల వచ్చిన రంగస్థలం, ఉప్పెన సినిమాల క్లైమాక్స్ లు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉప్పెన క్లైమాక్స్ అయితే ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక‌ ఇప్పుడు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కొత్త సినిమాకు కూడా ఇదే తరహాలో డిఫరెంట్ క్లైమాక్స్ ని చాలా కాలం పాటు గుర్తుండిపోయే విధంగా బుచ్చిబాబు డిజైన్ చేస్తున్నాడంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉండబోతుందని.. ఎప్పటికీ ఆడియన్స్‌లో గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా ఎవరు ఊహించని కొత్త తరహాలో క్లైమాక్స్ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్‌ని తెచ్చి పెడుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం ఈ క్లైమాక్స్ గురించే మాట్లాడుకునేలా బుచ్చిబాబు డిజైన్ చేస్తున్నాడట.

RC16: Janhvi Kapoor signs her second Telugu film with Ram Charan

ఈ క్లైమాక్స్ విని ఫిదా అయినా చరణ్ వెంటనే డేట్స్ ఇచ్చాడని టాక్ నడుస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో వింటేజ్‌ చరణ్ ని కూడా చూసేలా పాత త‌రం కెమెరాలతో సినిమా షూట్ చేయబోతున్నారట. ఒకప్పటి రోజుల్లో షూట్ కోసం ఫిలిమ్ రీల్ ని వాడేవారు. పాత తరం కెమెరాతో చిత్రీకరిస్తే కొన్నిషార్ట్స్ బాగా వస్తాయని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు అదే కారణంతో బుచ్చిబాబు కొన్ని సీన్స్ ని పాత రీల్ కెమెరాతో రూపొందించనున్నాడట. ఇలా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్క వార్త సినిమాపై మరింత హైప్‌ క్రియేట్ చేస్తుంది.