సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ అంటే తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. హీరో గానే కాదు.. కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సిద్ధార్ధ్. ఇప్పటికే ఎన్నో కాంట్రావెర్సీలతో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భార్య అధితితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని.. నా వ్యాధికి కారణం కూడా నా అభిమానులే అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంతకీ సిద్ధార్థ్ కి ఉన్న ఆ వ్యాధి ఏంటి.. ఎందుకు అభిమానులను దానికి భాద్యులను చేస్తున్నాడు.. ఒకసారి తెలుసుకుందాం. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ మాట్లాడుతూ.. చాలామంది ఇండస్ట్రీలో స్టార్డం కోసం ఆరాటపడుతూ ఉంటారు. నేను కూడా అలాగే చేశా. కానీ.. స్టార్‌డం వచ్చాక.. నా ఫ్యాన్స్ వల్లే నేను ఓ వ్యాధి బారిన పడ్డానంటూ చెప్పుకొచ్చాడు.
ఎంతమంది స్టార్‌డం వస్తే దాన్ని ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ.. నేను మాత్రం దాన్ని ఎంజాయ్ చేసే టైంలో ఇబ్బందులను ఎదుర్కొన్నా.. నాకు స్టార్డమ్ వచ్చాక అభిమానుల ఫాలోయింగ్ వల్ల.. పోస్ట్ ట్రామేటిక్ స్ట్రెస్ అనే వ్యాధి ఏర్పడింది. నాకు మంచి ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఎంతోమంది అభిమానులు.. నాతో మాట్లాడేందుకు, నన్ను చూసేందుకు ఆసక్తి చూపించారు. కానీ.. అభిమానులతో మాట్లాడితే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో అని వైద్యులను సంప్రదించ నాకున్న ఆశ్చర్యకరమైన వ్యాధి గురించి రివీల్ అయ్యింది. అయితే ఈ పోస్ట్ ట్రామేటిక్స్ ట్రస్ట్ డిజాస్టర్ నుంచి బయటపడడానికి చాలా రోజులు నేను సఫర్ అయ్యా.. అంతేకాదు దీని నుంచి కోలుకోవడానికి నాకు 8 సంవత్సరాల టైం పట్టింది.
ఎంజాయ్ చేసేలోపే అంతా మారిపోయింది. కానీ.. నాకు మంచి స్టార్ట్ అందించినందుకు ఫ్యాన్స్కు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. నాకు ఇంత స్టార్‌డం వచ్చినా టైం లో కూడా నేను అభిమానులకు కృతజ్ఞుడు గానే ఉన్న.. కానీ నా టెన్షన్ వాళ్లకు వేరేలా అర్థమైంది. ఆడియన్స్ అటెన్షన్‌ను నేను గుర్తించలేకపోయా అంటూ.. సిద్ధార్థ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న అధితి స్పాట్‌లైట్‌లో అటెన్షన్ గా ఉండడమంటే సిద్ధార్ధ్‌కు చాలా అసహ్యం. కానీ.. నేను మాత్రం అటెన్షన్నే ఇష్టపడతా అంటూ చెప్పుకొచ్చింది. దానికి కారణం ఎదుటివారు మనల్ని ఇష్టపడడం, ప్రేమించడం నేను అదృష్టంగా భావిస్తా. సిద్దు అలా ఉండడు అంటూ చిన్న పాటి గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే సిద్ధార్థ, అధితి కామెంట్స్ వైరల్ గా మారడంతో.. అధితి మాటలకే సపోర్ట్ చేస్తూ ఆమెను ప్రశంసిస్తున్నారు నెటిజన్స్.