టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లూ ఫ్యామిలీల వివాదం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ మధ్యన వార్ బద్ధ శత్రువుల తరహాలో కొనసాగుతుంది. వీరి కుటుంబాల మధ్య ఏదో జరుగుతున్నట్లు ఇన్ డైరెక్ట్ సంకేతాలు కూడా కనిపించడంతో.. ఆ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అలా తాజాగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కూడా దుమారంగా మారాయి.
టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే మొదట చిరు పెరే వినిపించేది. ఆయనకు ఉన్న గ్రేస్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హీరోకు కూడా లేదని.. చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చిరు ఫ్యామిలీలో వారసత్వంగా బన్నీ, చరణ్‌లకు ఆ డ్యాన్స్ టాలెంట్ వచ్చేసిందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ.. అల్లు అర్జున్ మాత్రం తాజాగా జరిగిన తండేల్ ప్రెస్ మీట్‌లో బన్నీ డ్యాన్స్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వేదికపై డ్యాన్స్ చేయాలని యాంకర్ కోరగా.. నాకు డ్యాన్స్ అసలు రాదు.. ఏదైనా మంచి మ్యూజిక్ వినపడితే కాళ్ళు ఊప్పుతాను తప్ప.. డ్యాన్స్ చేయలేను.
మా అబ్బాయి అల్లు అర్జున్‌కు వచ్చిన డ్యాన్స్ నాది కాదు.. వాళ్ళ అమ్మ నుంచి బన్నీకి డ్యాన్స్ వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక బన్నీని డ్యాన్స్ టాలెంట్ గురించి ప్రశంసిస్తూ వాళ్ళ అమ్మ నుంచి బన్నీకి ఆ టాలెంట్ వచ్చిందని.. ఆమె గొప్ప డాన్సర్ అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అరవింద్ కమెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో.. అల్లు అర్జున్ డ్యాన్స్ టాలెంట్‌కు చిరంజీవి ప్రమేయం ఏమీ లేకుండానే ఇంతలా ఎదగాడా అంటూ.. మరి కొంతమంది చిరంజీవి వల్ల అల్లు అర్జున్‌కు డ్యాన్స్ రాలేదనే విషయాన్ని అల్లు అరవింద్ ఇన్ డైరెక్ట్‌గా చెప్పదలుచుకున్నారు అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ మరోసారి కాంట్రవర్సీగా మారాయి.