అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. కొద్ది గంటల క్రితం రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఎలాగైనా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టాలని మేకర్స్ ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే రిలీజ్‌కు ముందు.. సినిమా కోసం రకరకాలుగా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు. ఇందులో భాగంగానే.. తాజాగా సాయి పల్లవి, నాగచైతన్యను.. నాగచైతన్య, సాయి పల్లవిని ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఇక ఇందులో భాగంగా సాయిపల్లవి నెటిజన్ల ఇంట్రెస్టింగ్ క్యూస్షన్లను.. చైతన్య పై సందించింది. అందులో అభిమాని ఏకంగా నాగచైతన్య యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు అని అడగడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
దానికి చైతన్య ఎలా రియాక్ట్ అయ్యారు.. ఆయన సమాధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తాజాగా సాయి పల్లవి తన ఎక్స్ వేదికగా ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో షేర్ చేసుకుంది. ముందుగా ఎందుకు.. ఈ సినిమా ఎక్స్ట్రా పర్సనల్గా తీసుకున్నారు అని.. ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా ఎక్స్ట్రా ప్రమోషన్స్ కూడా చేశారు అని అడిగింది. దానికి చైతు రియాక్ట్ అవుతూ హానెస్ట్‌గా చెబుతున్నా. ఇదొక రియల్ స్టోరీ.. రియల్ క్యారెక్టర్.. ఒక యాక్టర్ గా నేను ఇప్పుడు హిట్ కోసం ఆకలి మీద ఉన్న.. నా సినిమా రిలీజై ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది.. ఈ రెండు సంవత్సరాలలో నువ్వు నాలుగు సినిమాలను చేశావ్ అంటూ సరదాగా నవేసాడు. చైతన్య.. బాయ్స్ కి బడ్జెట్ స్క్రీన్ కేర్ చెప్పండి అని పల్లవి అడిగిన ప్రశ్నకు.. అమ్మాయిల్ని ఏడిపించకండి.. మీ స్కిన్ దానికదే గ్లో అవుతుంది.. హ్యాపీగా ఉండండి బ్రదర్ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావ్ అనే ఓ నెటిజన్ ప్రశ్నకు.. నాగచైతన్య కూల్ గా రియాక్ట్ అయ్యాడు. నిజానికి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్.. ఎప్పుడు నేర్చుకుంటావని ప్రశ్న ఏంటి.. కాలం గడిచే కొద్ది నేర్చుకుంటూనే ఉండాలి.. ఎప్పటికీ ఈ ప్రాసెస్ కి ఫుల్ స్టాప్ ఉండదు.. ఒకవేళ పుల్ స్టాప్ పెడితే గనుక నటుడుగా ఎదగడమే మానేసినట్టు.. అంటే ఫ్యూచర్ ఏ ఉండదు.. డెవలప్మెంట్ ఉండదు.. నేను ఇంకా నేర్చుకోలేదు.. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా అంటూ నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. యాక్టింగ్ స్కిల్స్‌ను టార్గెట్ చేస్తూ కాంట్రవర్షియల్‌గా క్వశ్చన్ అడిగినా.. నాగచైతన్య మాత్రం కూల్ గా మెచ్యూర్డ్‌గా సమాధానం చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ చైతన్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Looks like the interview went well! @chay_akkineni
New side hustle😎 😝#Thandel #ThandelFromTomorrow pic.twitter.com/qNq8bopXfF— Sai Pallavi (@Sai_Pallavi92) February 6, 2025