స్టేజ్ ఆర్టిస్టులుగా, వెండి తెరపై , బుల్లి తెరపై ఇలా.. రకరకాలుగా ప్రజలను నవ్వించే కమెడియన్లు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. వారిలో కొందరు నువ్వుల వెనుక ఎన్నో కష్టాలు, అగాధాలు ఉంటాయి. అలా.. పాపులర్ టెలివిజన్ యాక్టర్, స్టాండ్ అఫ్ కమెడియన్ సిద్ధార్థ సాగర్ జీవితంలోను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ప్రజలను కడుపుబ్బ నవ్వించే అతనికి మాత్రమే తెలుసు.. కపిల్ శర్మ, కృష్ణ అభిషేక్, సుదేష్ లెహ్రి లాంటి కమెడియన్స్ తో కలిసి కామెడీ సర్కస్, ది కామెడీ శర్మ షో లలో కనిపించిన సిద్ధార్థ.. సక్సెస్ వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయని స్వయంగా వివరించాడు. అతని కుటుంబ పరిస్థితులు, డ్రగ్స్ అడిక్షన్, వ్యక్తిగత పోరాటాల గురించి ఒకసారి తెలుసుకుందాం. 2009లో కామెడీ సర్కస్ పేరుతో సిద్ధార్థ తన సినీ కెరీర్ ప్రారంభించాడు. అక్కడ కృష్ణ అభిషేక్, సుదేష్ లెహ్రితో కలిసి ప్రేక్షకులను నవ్వించిన ఆయన.. తర్వాత ది కపిల్ శర్మ షోలో ఆడ్ అయ్యాడు. మిమిక్రీ స్కిల్స్ తోను పాపులారిటి దక్కించుకున్నాడు.
ఇక ప్రస్తుతం సిద్ధార్థ నా కొత్త షో కోసం సన్నాహాలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్న సిద్ధార్థ్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఊహించినంత హ్యాపీ లేదట. కామెడీలో సక్సెస్ అయిన సిద్ధార్థ.. పర్సనల్ లైఫ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడని.. 2017లో డ్రగ్స్ రెహబిలిటేషన్ సెంటర్లో చేరడని అక్కడ నాలుగు నెలలు ఉన్న తర్వాత డ్రగ్స్ అలవాటు నుంచి కోలుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సిద్ధార్థ్ తన తల్లిదండ్రుల గురించి ఎన్నో షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తల్లి తన ఆహారంలో బై పోలార్ డిజార్డర్ మందులను కలిపి ఇచ్చేదని.. తన ప్రియుడు సుయాష్ గాడ్గిల్‌తో కలిసి.. వారి బంగ్లా ఆర్థిక వ్యవహారాలను తన ఆధీనంలోకి తీసుకుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక సిద్ధార్థ్ 2014 ప్రీతం ప్యార్ ఔర్ ఓ షోలో పనిచేశాడు. తర్వాత ఒకరోజు సడన్గా మిస్ అయ్యారు. 2017లో అతడు కనిపించకుండా పోయాడు అంటూ కథనాలు వినిపించాయి. 2018 మార్చిలో సిద్ధార్థ విలేకరుల సమావేశంలో దీనిపై మాట్లాడాడు. తన తల్లి, ఆమె ప్రియుడు తనను డ్రగ్స్ అడిక్షన్ లోకి నెట్టారని చెప్పుకొచ్చాడు.
ఫుడ్ లో తన తల్లి డ్రగ్స్ కలుపుతుందని ఇది.. వైపోలార్ డిసార్డర్ డిప్రెషన్ కు దారి తీసింది అని వివరించాడు. దీంతో ఎప్పుడూ లేనంత మత్తులో ఉండే వాడిని.. మెలకువగా ఉండేవాడిని కాదంటూ చెప్పుకొచ్చాడు. చివరికి అతని ముంబైలోని పునరావస కేంద్రానికి పంపించారని.. అదే సమయంలో తల్లి తన ప్రియుడితో కలిసి రూ.80 లక్షలకు బంగ్లాన్ని విక్రయించిందని.. దాంతో సిద్ధర్ద్ ఆర్ధికంగా, మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. దీని వ్యతిరేకించినందుకు.. తనను నలుగురైదుగురు వ్యక్తులు కొట్టారంటూ సిద్ధార్థ స్వయంగా వెల్లడించాడు. విలేకర్ల సమావేశంలో సిద్ధార్థ్ తన కష్టాలు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. గత నాలుగు సంవత్సరాలు నాకు చాలా కష్టంగా గడిచాయని.. నేను 2012లో ఎంటర్టైన్మెంట్ కెరీర్ ను ప్రారంభించే ఆధ్యాత్మికంగా కూడా ఉన్నా. నా తల్లి మాత్రమే నాకు ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆమెనే.. కానీ సుయాష్ గాడ్జిల్లో కలిసిన తర్వాత ఆమె పూర్తిగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంత అన్యాయం జరిగిన ఇప్పటికీ సిద్ధార్థ్ తన తల్లిని వదలకుండా ఆమెతోనే ఉంటున్నారు.