చైతు ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్.. ఏం చెప్పిందంటే..?

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తండెల్ తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చందు మొండేటి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు గీతా ఆర్ట్స్‌2 బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. నాగచైతన్య.. సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను చైతు.. పల్లవి పై సందించారు.

Naga Chaitanya's massive fee hike for Thandel, four times more than Sai Pallavi

యాక్టింగ్ కాకుండా సాయి పల్లవికి మరేదైనా ఫ్యాషన్ ఉందా అని అడగగానే.. సాయి పల్లవి తనకు తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని రీసెంట్ గా దాన్ని ప్రారంభించానంటూ చెప్పుకొచ్చింది. వెంటనే చైతన్య.. సాయి పల్లవికి బన్ మాస్క్, కొబ్బరినీళ్లు అంటే కూడా ఇష్టమని.. అన్నిటికంటే నిద్రంటే బాగా ఇష్టమంటే చెప్పుకొచ్చాడు. రాత్రి 9 అయితే ఎక్కడున్నా నిద్రపోతుందని ఆయన కామెంట్స్ చేశాడు. సాయి పల్లవి డైరెక్షన్లో సినిమా ఎప్పుడు వస్తుందని అడగ్గా.. నాకు అసలు ఆలోచన లేదు చేయనని సాయి పల్లవి చెప్పేసింది. అందుకు నాగచైతన్య లేదు.. నువ్వు అబద్దాలు చెప్తున్నావ్ ఎప్పటికైనా సినిమా తీస్తా.. అందులో నన్ను యాక్టర్‌గా తీసుకుంటానని కూడా చెప్పావని నాగచైతన్య కామెంట్స్ చేశాడు.

ఇక‌ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్ తో డిన్నర్ చేయాలని ఉందని చైతన్య అడ‌గ‌గా అమెరికన్ యానిమేటెడ్ సిటీకం అయినా సిమ్సన్స్ ఫ్యామిలీతో డిన్నర్ చేయాలనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. చైతన్య డ్యాన్స్ చూసి మీకు ఏమనిపించిందని ప్రశ్నించగా.. ఓ అభిమాని ప్రశ్నకు సాయి పల్లవి రియాక్ట్ అవుతూ.. గతంలో చైతన్య డ్యాన్స్ చేస్తూ అప్పుడప్పుడు బ్యాక్ స్టెప్స్ వేసేవాడు.. కానీ నమో నమః సాంగ్ కు మాత్రం ముందుకు దూకి మరి డ్యాన్స్ చేసాడని సాయి పల్లవి చెప్ప‌పుకొచ్చింది. శ్రీకాకుళం యాసలో సీన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అని.. కానీ గతంలో తెలంగాణ యాస నేర్చుకున్నట్టే ఇప్పుడు ఇది కూడా నేర్చుకున్న అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తండేల్ సెట్స్ లో చైతన్య మీకు ఏమైనా అబద్ధం చెప్పాడా.. అనే ప్రశ్నకు సమాధానంగా తాను అక్కడ లేని టైం చూసుకొని పల్లవి నన్ను పిలిచి ఆ సీన్లు ఎలా చేద్దాం.. అలా చేద్దాం.. అని చెప్తుంది అని అంటుంటాడు. ఎప్పుడైతే నా మాట వినిపిస్తుందో వెంటనే సైలెంట్ అయిపోతాడని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. షూటింగ్ లేకుండా ఉంటే ఖాళీ టైంలో సినిమాలు చూస్తానని.. వంట చేయాలనుకున్న చేయలేను కాబట్టి ఆర్డర్ పెట్టుకుంటానంటూ వివరించింది. ఇక‌ తోట పని చేస్తూ క్యారెట్లు పండిస్తానని వివరించింది. ఇక వాట్స్అప్‌లో కోతుల స్టిక్కర్స్ ని ఎక్కువగా వాడుతున్న అని చెప్పిన సాయి పల్లవి.. ఎవరైనా సరే నలిగిన బట్టలు వేసుకుంటే తనకు నచ్చదని.. తన ఫ్యామిలీలో ఎవరైనా అలా కనిపిస్తే వెంటనే వాటిని సెట్ చేయాలని ట్రై చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే చైతన్య అబ్బాయిలు విన్నారుగా ఈసారి సాయి పల్లవిని కలిసే ముందు నీట్ గా ఐరన్ డ్రెస్ వేసుకుని వెళ్లి ఇంప్రెస్ చేయండి అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరి సరదా చిట్ చాట్ వైరల్ గా మారుతుంది.