స్టార్ యాక్టర్ సోను సుద్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లోనే కాదు నార్తులను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సోను సూద్.. ఎన్నో సేవా కార్యక్రమాలతోనూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. సోను సూద్‌పై తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లకపోవడంతో పంజాబ్‌లోని లుధియానా కోర్ట్ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.
ముంబైలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఓసివారా పోలీస్ స్టేషన్‌కు లుధియానా జ్యూడిషల్ మెజిస్ట్రేట్ రామన్ ప్రీత్ కౌర్ అరెస్ట్ వారెంట్ జారీ చేశాడు. అతని అరెస్ట్ చేసి కోర్ట్‌లో ప్రవేశపెట్టాలని ఈ ఉత్తర్వుల వెల్లడించారు. లుధియానకు చెందిన న్యాయవాది రాజేష్ కన్నా.. తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టగా.. రజిక కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనుసూద్ సాక్షిగా చెప్పుకొచ్చాడు.
దీంతో విచారణ చేపట్టిన కోర్ట్ సోను సూద్‌కు అన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. సోను సూద్‌కు పదిసార్లు సామాన్లు పంపించినా అతను కోర్ట్‌కు హాజరు కాకపోవడంతో.. వెంటనే అతని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక కేస్‌పై మరోసారి ఈ నెల 10న విచారణ జరగనుంది. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో.. సోనుసూద్ లాంటి మంచి వ్యక్తికి అరెస్టు వారెంట్ అసలు సరికాదని.. ఆయన ఏ కారణాలతో కొర్ట్‌కు హాజరు కాలేకపోయారో సరైన సమాచారం తెలుసుకొని.. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిసన్స్. ఇక ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.