మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా.. రామ్ నారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ లైలా. సాహూ గార్లపాటి ప్రొడ్యూసర్గ వ్యవహరించిన ఈ సినిమాను వాలెంటెన్స్‌డే సందర్భంగా.. ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ తో పాటు పాటలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా.. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్‌లో విశ్వక్ మాట్లాడుతూ.. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా రానున్నట్లు వివరించాడు. అయితే.. విశ్వక్ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి.. నందమూరి హీరోలకు అభిమానిని అంటూ చెబుతున్నే ఉన్నారు.
ఇప్పటికే తన సినిమా ఈవెంట్లకు ఎన్టీఆర్ తో పాటు.. బాలయ్యను కూడా చాలా సార్లు ఆయన స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. తాజాగా వస్తున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం మెగాస్టార్ స్పెషల్ గెస్ట్ అంటూ వివరించాడు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ దీనిపై ప్రశ్న సందించాడు. నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్‌కి జంప్ అయ్యారేంటి అని రిపోర్టర్ అడగగా దానికి విశ్వక్ మాట్లాడుతూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. కాంపౌండ్లు మీరు వేసుకుంటారు.. మాకు ఉన్నది ఒక్కటే కాంపౌండ్ అది మా ఇంటి కాంపౌండ్ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక్కడ కాంపౌండ్‌లు ఏమీ ఉండవు. ఇండస్ట్రీలో అంతా సమానమే. బాస్ ఇజ్ బాస్. మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారో.. మేము అభిమానించే వాళ్లు కూడా అలానే ఉంటారు. ప్రతిసారి మేము అభిమానించే వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టలేము. ఇక ఒక సినిమా వేడుకకు హీరోని పిలవడానికి వెయ్యి కారణాలు ఉంటాయి. అంతేగాని ఇలా బౌండరీస్ పెట్టి మమ్మల్ని అందరినీ వేరు చేయకండి.. అంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
BOSS is BOSS!
I’m not a compound hero. There are 100 reasons to invite a hero for the event. Industry Andharam Okkate, compound lu levu.
– #VishwakSen at #Laila Trailer launch
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) February 6, 2025