అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. ఈ సినిమా కోసం అభిమానుల ఎదురుచూపుకు చెక్ పడింది. అలా కొద్ది సేపటి క్రితం సినిమా ప్రీమియర్ షోస్ ముగ్గిసాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మూవీ చూసిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
తండేల్ సినిమా చైతు యాక్టింగ్ అదిరిపోయింది అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి పల్లవి ఎప్పటిలాన్నే 100% ఇచ్చేసిందట. ఇక సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి ఉంటే హీరో కంటే ఆమె పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ.. ఈ సినిమాలో మాత్రం చైతు తన్న అటెన్షన్ను గ్రాఫ్ చేశాడని.. ఆయన నటన హైలెట్‌గా నిలిచిందని చెప్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే చైతు యాక్టింగ్ సినిమాలో మరింతగా మెప్పించిందట. మత్స్యకారుడిగా చైతు మేకోవర్, నటన, శ్రీకాకుళం యాసలో డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నటుడిగా చైతుకి మంచి పేరు తీసుకువచ్చే సినిమా తండేల్ అని చెప్తున్నారు. ఇక సినిమాల్లో సాయి పల్లవి, చైతు కెమిస్ట్రీ అదిరిపోయిందని.. వీరిద్దరి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కానుందంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి పాటలే కాదు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ సినిమాకు మరింత బలం చేకూర్చిందట. పాటల పిక్చరైజేషన్ కూడా మెప్పిస్తుందని రాసుకొచ్చారు. సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్, దేశభక్తి పోర్షన్, క్లైమాక్స్ పీక్స్ లెవెల్ అని.. అందరు కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ కామెంట్లు చేశారు. మూవీ విషయంలో ఒకటే మైనస్ అంటూ కొంతమంది రాసుకొచ్చారు. అదే మొదటి 30 నిమిషాల పోర్షన్. ఆసక్తిగా లేదని చెబుతున్నారు. లవ్ స్టోరీ రొటీన్ స్లో మోడ్ అనిపించిందని వివరిస్తున్నారు. అరగంట సినిమాకు కనెక్ట్ కాలేదని.. తర్వాత నుంచి సినిమా సూపర్ అంటూ.. అక్కడక్కడా సినిమాకి డ్రాగ్ చేసినట్లు అనిపించినా ఆడియన్స్‌ను మెప్పిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమా ఇంటర్వెల్ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ ఆకట్టుకునేలా ఉందని.. అయితే దేశభక్తి సీన్లు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సన్నివేశాలు ఆర్టిఫిషియల్ గా కనిపించాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఆ సన్నివేశాలు మంచి ఇంపాక్ట్ చూపిస్తాయట. సినిమా సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అందరినీ మెప్పిస్తుందని.. చాలా వరకు ప్రేక్షకులు ఆకట్టుకుంటుందని చేప్తున్నారు. ఎమోషనల్ సీన్స్ బాగా పండించారని చెబుతున్నారు. అలా ఇప్పటివరకు సినిమాకు వచ్చిన ట్విట్టర్ రివ్యూలన్నీ చాలా శాతం పాజిటివ్ గానే వచ్చాయి. ఫస్ట్ అఫ్ మొదటి అరగంటపై కాస్త నిరాశ వ్యక్తం చేసినా.. తర్వాత సినిమా అంతా హైలెట్ గా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.