వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ ఇదే.. ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పక్కా.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న తారక్.. ఈ సినిమాలో వీరేంద్ర‌ రఘునాథ్‌గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. వార్ 2 కోసం తారక్‌ ఏకంగా రూ.30 కోట్ల రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడని టాక్. ఇక ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని అభిమానులు ఆశ పడుతున్నారు.

Hrithik and NTR's War 2 Release Date Announced - Telugu360

బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వాటిలో యాక్షన్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పెట్టరున్నాడట. హృతిక్, తారక్ కాంబినేషన్ సీన్‌లు అయితే చూసేందుకు రెండు కళ్ళు చాలవ‌ని టాక్ నడుస్తుంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా లో ఎలివేషన్స్, ట్విస్టులు కూడా అదే రేంజ్‌లో ఉండనున్నాయని సమాచారం.

War 2: Jr NTR spotted in Mumbai filming for Hrithik Roshan-starrer, fans  launch countdown to film's 2025 release - Hindustan Times

ఈ క్రమంలోనే వార్‌2 నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్‌పై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్‌ నెలకొంటుంది. ఇక ఈ సీన్ స్క్రిప్ట్ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకునేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కొద్ది రోజుల‌లో ప్రారంభం కానున్నాయని సమాచారం. ఇక వార్ 2 సినిమా ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఆడియన్స్‌ను ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి.