టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్‌కు తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా కమర్షియల్ సినిమాలతో సక్సెస్‌లు అందుకుంటున్న ఈ యంగ్ హీరో.. మధ్యమధ్యలో ఎక్సపరిమెంటల్ సినిమాలు కూడా చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల మెకానిక్ రాఖీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్న విశ్వక్.. ఇప్పుడు మరోసారి లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమాలో.. విశ్వక్ లేడి పాత్రలో మెరువనున్నాడు.
రామ్ నారాయణ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా వాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు.. ఆడియో సాంగ్స్ విపరీతంగా ఈకట్టుకున్నాయి. ఇక తాజాగా సినిమా నుంచి మరో అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. హైదరాబాదులోని ఏఏఏ సినిమాస్‌లో ఈ లైలా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఇక ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ చూసిన అభిమానులు ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా సక్సెస్ అందుకోవడం ఖాయమని.. యాక్షన్ తోను విశ్వక్ అదరగొట్టాడంటూ.. లేడీ గెటప్ లో ఆయన నటన అదుర్స్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సోను మోడల్ గెటప్ లో మాస్ కా దాస్ అభిమానులకు వాలెంటైన్స్ డే రోజున ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో.. ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు వేచి చూడాలి.